Sweet Lemon: దంత క్షయానికి, షుగర్ పేషెంట్స్ కు చక్కటి మెడిసిన్ ఈ సీజనల్ ఫ్రూట్.. జ్యూస్ కంటే.. పండుగా తినడమే బెస్ట్..

Sweet Lemon Benefits: చూడడానికి పెద్ద నిమ్మకాయలా కనిపించినా తియ్యని రుచికలిగిన ఈ పండుని బత్తాయి (Orange fruit)అని స్వీట్ లెమన్ అని అంటారు. రూటేసి కుటుంబానికి చెందిన..

Sweet Lemon: దంత క్షయానికి, షుగర్ పేషెంట్స్ కు చక్కటి మెడిసిన్ ఈ సీజనల్ ఫ్రూట్..  జ్యూస్ కంటే.. పండుగా తినడమే బెస్ట్..
Mousambi Benefits
Follow us

|

Updated on: Jan 28, 2022 | 10:59 AM

Sweet Lemon Benefits: చూడడానికి పెద్ద నిమ్మకాయలా కనిపించినా తియ్యని రుచికలిగిన ఈ పండుని బత్తాయి (Orange fruit)అని స్వీట్ లెమన్ అని అంటారు. రూటేసి కుటుంబానికి చెందిన తియ్యని పండ్ల చెట్టు. పండిన బత్తాయి(Sweet Lemon) గుజ్జు లేత పసుపు రంగులో ఉంటుంది. దీనిని ఒలుచుకుని తోనలుగా తీసుకుని తింటారు.. రసం తీసుకుని కూడా తాగుతారు. ముఖ్యంగా జ్వరం వంటి వ్యాధుల బారిన పడినవారికి తక్షణ శక్తిని ఇస్తుందని.. బత్తాయి రసాన్ని ఇస్తారు. బత్తాయి కాయలు జ్యూస్ తీసుకుని తాగడం కంటే నమిలి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అయితే సీజనల్ ఫ్రూట్ బత్తాయి పండుని తినడం వలన కలిగే ప్రయోజనాలు ఈరోజు తెలుసుకుందాం..

*విటమిన్-సి లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధిని అరికట్టడంలో మంచి సహాయకారి ఈ పండు. *బత్తాయి తొనలు ను నమిలి తినడం వలన పళ్ళ మధ్యలో ఉండే బ్యాక్టీరియా చచ్చిపోతుంది. చిగుళ్ళ నొప్పులు, గొంతు సంబంధ ఇన్‌ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. *పండిన బత్తాయిలు నమిలి తినడం వలన పళ్ళపై ఉండే ఎనామిల్ రక్షించబడుతుంది. *బత్తాయిలు నమిలి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పేగులు శుభ్రపడతాయి. పేగులలో చెడు బ్యాక్టీరియాను తొలగించి మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. *మలబద్ధకాన్ని నివారిస్తుంది. విరోచనం సాఫీగా జరుగుతుంది. *షుగర్ ఉన్నవాళ్లు బత్తాయిలు ఎక్కువగా తినడం మంచిది. డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు బత్తాయి రసం తాగడం కంటే తొనలు నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. *బత్తాయి లో ఉండే ఫ్లేవనాయిడ్స్ జీర్ణక్రియను యాక్టివ్ గా చేసి ఎంజైమ్లు విడుదల అవ్వడానికి జీర్ణ రసాలు విడుదల అవ్వడానికి ఉపయోగపడతాయి. *పోషక విలువలతోబాటు ఔషధ పరంగా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. 2016లో ఇంటిగ్రల్ యూనివర్సిటీ లక్నో చేసిన పరిశోధనల ప్రకారం బత్తాయిలో ఉండే ఎసిడిక్ నేచర్ పళ్ళ సందుల్లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దంత క్షయం నుంచి రక్షిస్తాయి. అంతేకాదు జలుబు, జ్వరం వచ్చినపుడు త్వరగా కోలుకోవడానికి దీన్ని రసాన్ని ఇస్తారు. బత్తాయి రసం చర్మానికి కూడా మంచిదే. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మచ్చల్ని మాయం చేస్తుంది

Note:  ఈ చిట్కాలు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే.. వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. మీ ఆరోగ్యం లేదా వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఎల్లప్పుడూ మీ డాక్టర్ లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుల సలహాలను సూచనలు తీసుకోండి.

Read Also:

Nellore: నెల్లూరులో అగ్నిప్రమాదం.. హైదరాబాద్‌ మహిళ సజీవ దహనం.. దర్గాకు వచ్చి.

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..