AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sweta Varma: బుల్లెట్ బండిని కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. రైడ్ కు వెళ్లే టైమొచ్చిందంటూ..

ఒకసారి బిగ్ బాస్ (Bigg Boss) హౌస్ లోకి అడుగుపెడితే  బోలెడంత క్రేజ్ తో పాటు క్యాష్ కూడా వస్తోంది. వారి దశ పూర్తిగా మారిపోతుంది.

Sweta Varma: బుల్లెట్ బండిని కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. రైడ్ కు వెళ్లే టైమొచ్చిందంటూ..
Basha Shek
|

Updated on: Jan 28, 2022 | 2:31 PM

Share

ఒకసారి బిగ్ బాస్ (Bigg Boss) హౌస్ లోకి అడుగుపెడితే  బోలెడంత క్రేజ్ తో పాటు క్యాష్ కూడా వస్తోంది. వారి దశ పూర్తిగా మారిపోతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఎంతో మంది విలాసవంతమైన అపార్ట్ మెంట్లు, విల్లాలు, కార్లు, బైక్ లు కొనుగోలు చేశారు. మొన్న నటుడు  ఖరీదైన విశ్వ (Viswa) బీఎండబ్ల్యూ  కారు కొనగా.. నిన్న లహరి (Lahari) అదే కంపెనీకి చెందిన లగ్జరీ బైక్ ను కొనుగోలు చేసింది. తాజాగా ‘ఏదైనా సరే ఇచ్చి పడేద్దాం’ అంటూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు సందడి చేసిన శ్వేతా వర్మ (Sweta Varma) రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను ఇంటికి తెచ్చేసుకుంది. బైక్ రైడింగ్ లంటే ఎంతో ఆసక్తి చూపే ఈ ముద్దుగుమ్మ తన కొత్త బైక్ విషయాలను సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోయింది.

ఈ సందర్భంగా ‘యుగ‌న్ నిర్వాణ‌ను మీకు ప‌రిచ‌యం చేస్తున్నాను.. ఈ బైక్‌ను రైడ్ చేయాల్సిన స‌మ‌యం ఆసన్నమైంది’ అని  ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది శ్వేత . అయితే ఈ బైక్ ధరేంతో ఎక్కడా చెప్పలేదు.  కాగా కొత్త బైక్ ను కొన్న శ్వేతకు అభిమానులు, నెటిజన్లు  ఈ ముద్దుగుమ్మకకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ‘ఇచ్చి పడేయ్ మచా’, ‘నీకు బైక్ పర్ఫెక్ట్ గా సూట్ అయింది’  అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా సత్తా చాటుతోంది శ్వేతా వర్మ.  ఇప్పటికే  ప‌చ్చీస్‌, ద రోజ్ విల్లా, ఏకమ్‌, ముగ్గురు మొన‌గాళ్లు, మిఠాయి, మ్యాడ్, గ్యాంగ్ ఆఫ్ గ‌బ్బ‌ర్ సింగ్‌, సంజీవ‌ని, నెగెటివ్ తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది. కాగా కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించి నేడు (జనవరి 28) న విడుదల కానున్న ‘గుడ్ లక్ సఖి’ లోనూ ఆమె ఓ కీలక పాత్రలో నటించింది.

Also read:

IPL 2022 Auction: ‘దేవుడికి వెల కట్టలేం బ్రో’.. మెగా వేలానికి ముందు నెట్టింట్లో వైరలవుతోన్న టీమిండియా క్రికెటర్ల వీడియో..

Himaja: విడాకుల వదంతులపై స్పందించిన హిమజ.. ఇన్ స్టా వీడియోలో ఏం చెప్పిందంటే..

Coronavirus: భారత్ లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్.. భారీగా వెలుగు చూస్తోన్న కేసులు..