IPL 2022 Auction: ‘దేవుడికి వెల కట్టలేం బ్రో’.. మెగా వేలానికి ముందు నెట్టింట్లో వైరలవుతోన్న టీమిండియా క్రికెటర్ల వీడియో..

ఐపీఎల్ మెగా వేలాని (IPL Mega Auction)  కి  ముహూర్తం ముంచుకొస్తోంది . ఫిబ్రవరి 12, 13 తేదీల్లో  వేలం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి

IPL 2022 Auction: 'దేవుడికి వెల కట్టలేం బ్రో'.. మెగా వేలానికి ముందు నెట్టింట్లో వైరలవుతోన్న టీమిండియా క్రికెటర్ల వీడియో..
Follow us

|

Updated on: Jan 28, 2022 | 1:43 PM

ఐపీఎల్ మెగా వేలాని (IPL Mega Auction)  కి  ముహూర్తం ముంచుకొస్తోంది . ఫిబ్రవరి 12, 13 తేదీల్లో  వేలం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.  కాగా ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్‌ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అదేవిధంగా ఈసారి కొత్తగా ఐపీఎల్ లో అడుగుపెడుతోన్న లక్నో(Lucknow) , అహ్మదాబాద్‌ (Ahmedabad) ఫ్రాంఛైజీలు సైతం తమ ముగ్గురు ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి.  లక్నో సూపర్‌ జెయింట్స్‌కు టీమిండియా వన్డే వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహిస్తోండగా.. అహ్మదాబాద్‌కు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టనున్నాడు.  కాగా ఈ మెగా వేలానికి ముందు టీమిండియా ఆటగాళ్లకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  శార్దూల్‌ ఠాకూర్‌, యుజువేంద్ర చాహల్‌, రాహుల్‌ ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో ఓ హోటల్ కు వెళ్లగా అక్కడ ఐపీఎల్ మెగా వేలం గురించి ముగ్గురి మధ్య చర్చ మొదలైంది.

నా కోసం ఎంత ఖర్చుపెడతారు !

మొదట శార్దూల్ మాట్లాడుతూ ‘  నా కోసం మీ ఫ్రాంఛైజీ ఎంత బడ్జెట్ కేటాయిస్తుంది’ అంటూ లక్నో కెప్టెన్ రాహుల్ ను అడుగుతాడు. దీనికి లక్నో సారథి స్పందిస్తూ ‘ బేస్ ప్రైస్ (కనీసధర)’ అని సమాధానమిస్తాడు. మధ్యలో జోక్యం చేసుకున్న చాహల్ ‘లార్డ్ (దేవుడు)కి కూడా బడ్జెట్ కేటాయించగల మనుషులు ఉంటారా?’  అని సరదాగా జోక్ వేస్తాడు.  కాగా గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్ సందర్భంగా శార్దూల్‌ పేరు బాగా  మార్మోగిపోయింది. ఆ సిరీస్‌లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. అప్ప‌టి నుంచే  తనను లార్డ్ శార్ధూల్ ఠాకూర్‌ అని పిలుస్తున్నారు. కాగా ఐపీఎల్‌- 2021 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన శార్దూల్‌ అద్భుతంగా రాణించాడు. ధోనీ సేన మళ్లీ ట్రోఫీని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.  అయితే రిటెన్షన్‌  ప్రక్రియలో భాగంగా నలుగురు ఆటగాళ్లనే అంటిపెట్టుకోవాల్సి రావడంతో చెన్నై అతడిని వదిలేసింది.   దీంతో  వేలంలోకి వెళ్లనున్నాడు శార్దూల్‌.

Also read: Himaja: విడాకుల వదంతులపై స్పందించిన హిమజ.. ఇన్ స్టా వీడియోలో ఏం చెప్పిందంటే..

Devulapalli Subbaraya Sastri: డుంబు సృష్టికర్త ఇక లేరు.. చెన్నైలో కన్నుమూసిన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి ..

Crime News: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య..