Devulapalli Subbaraya Sastri: డుంబు సృష్టికర్త ఇక లేరు.. చెన్నైలో కన్నుమూసిన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి ..
ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు ( Devulapalli Krishnasastri), ‘డుంబు (Dumbu)’ పాత్రతో కామిక్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (91) (Devulapalli Subbaraya Sastri) కన్నుమూశారు.
ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు ( Devulapalli Krishnasastri), ‘డుంబు (Dumbu)’ పాత్రతో కామిక్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (91) (Devulapalli Subbaraya Sastri) కన్నుమూశారు. చిట్టిపొట్టి బొమ్మలు, బాలల కథల సంపుటితో ‘బుజ్జాయి ‘గా గుర్తింపు పొందిన ఆయన గత కొద్దికాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో నిన్న రాత్రి చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సుబ్బరాయ శాస్త్రి మృతి పట్ల పలువురు ప్రముఖులు, చిత్రకారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 1931 సెప్టెంబర్ 11న జన్మించారు సుబ్బరాయశాస్త్రి. తండ్రి ప్రముఖ కవి, రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి కాగా తల్లి రాజహంస. బాల్యం నుంచే చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్న సుబ్బరాయ శాస్త్రి అందులోనే తన జీవితాన్ని వెతుక్కున్నారు. అడవి బాపిరాజు, మొక్కపాటి, పిలకా, గోఖలే వంటి దిగ్గజాల వద్ద చిత్రలేఖనంలో మెలకువలు నేర్చుకున్నారు.
బొమ్మలతో కథలు చెబుతూ..
కాగా 17 ఏళ్ల వయసులోనే ‘బానిస పిల్ల’ పేరుతో 30 పేజీల బొమ్మల కథా పుస్తకాన్ని ప్రచురించారు సుబ్బరాయశాస్త్రి. ఆతర్వాత వివిధ దిన పత్రికలు, వార పత్రికల్లో కార్టూనిస్ట్ గా పనిచేశారు. తన కామిక్ కథలతో ఒక కొత్త రకం ప్రపంచాన్ని సృష్టించారు. ప్రముఖ కవి గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకాన్ని బొమ్మల ద్వారా పాఠకులకు మరింత చేరువ చేశారు. ఇక పిల్లలను ఎంతో అలరించిన పంచతంత్రం కథలను అందమైన బొమ్మల రూపంలో వేసి ఐదేళ్ల పాటు ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో ప్రచురితం చేశారు. ఇక బాపు రమణల బుడుగు లాంటి క్యారెక్టర్ ‘డుంబు’ అనే కార్టూన్ పాత్రను సృష్టించారు. తన జీవత కాలంలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో 100కుపైగా చిన్నారుల కామిక్స్, కథల పుస్తకాలను సుబ్బరాయశాస్త్రి ప్రచురించారు. కళామతల్లికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1992లో ఏపీ ప్రభుత్వం ఆయనను ‘బాలబంధు’ బిరుదుతో సత్కరించింది.
ఇక దేవులపల్లి సుబ్బరాయశాస్త్రికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తన కుమారునికి కూడా తండ్రి పేరు దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి పేరే పెట్టారు. ఆయన కుమారుడు కూడా రచయితగానే స్థిరపడ్డారు.
Also Read:Coronavirus: భారత్ లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్.. భారీగా వెలుగు చూస్తోన్న కేసులు..
Pushapa: బాలీవుడ్ కు బంగారు గనిగా మారిపోయిన బన్నీ.. హిందీలో 100 కోట్ల బిజినెస్ చేసిన పుష్ప..
Crime News: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య..