UP Elections 2022: యూపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పేరు హాట్ టాపిక్‌.. విపక్షాలకు ఆరాధ్యుడంటూ యోగి ధ్వజం

UP Elections 2022: యూపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పేరు హాట్ టాపిక్‌.. విపక్షాలకు ఆరాధ్యుడంటూ యోగి ధ్వజం
Yogi Adityanath

Uttar Pradesh Assembly Elections 2022: ఉత్తర ప్రదేశ్(యూపీ)లో తొలి దశ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రచారపర్వం వేడెక్కింది. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Janardhan Veluru

| Edited By: Anil kumar poka

Jan 28, 2022 | 8:53 PM

Uttar Pradesh Assembly Elections 2022: ఉత్తర ప్రదేశ్(యూపీ)లో తొలి దశ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రచారపర్వం వేడెక్కింది. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార, విపక్ష నేతలు తరచూ పాక్ జాతిపిత ముహమ్మద్ అలీ జిన్నా(Jinnah) పేరును లేవనెత్తుతున్నాయి. గతంలో జిన్నా పేరును ప్రస్తావిస్తూ మైనార్టీలకు దగ్గరయ్యేందుకు సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ప్రయత్నించారు. అలాగే భారత్‌కు నిజమైన శత్రువు పాకిస్థాన్ కాదంటూ అఖిలేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ముస్లీం ఓట్ల కోసమే అఖిలేష్ యాదవ్ జిన్నా భజన చేస్తూ పాకిస్థాన్‌ను నెత్తికెత్తుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మరికొందరు సమాజ్‌వాది పార్టీ నేతలు కూడా జిన్నా, పాకిస్థాన్‌‌ పేర్లను ప్రస్తావిస్తూ బీజేపీ‌పై విమర్శనాస్త్రాలు సంధించడంతో ఈ అంశం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath).. జిన్నా పేరును ప్రస్తావిస్తూ విపక్షాలను టార్గెట్ చేశారు. యూపీలోని ప్రతిపక్షాలు పాక్ జాతి పిత ముహమ్మద్ అలీ జిన్నాను ఆరాధిస్తున్నాయంటూ ఆరోపించారు. భారత స్వాతంత్ర పోరాటయోధుడు, ధివంగత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను మాత్రం విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. విపక్షాలు జిన్నాను ఆరాధిస్తుంటే.. తాము సర్దార్ పటేల్‌ను ఆరాధిస్తున్నట్లు పేర్కొన్నారు. భరత మాత కోసం మనం ఎన్నో ప్రాణాలు కోల్పోయాం.. అయితే విపక్షాలకు పాకిస్థాన్ అంటే ఎంతో ఇష్టమంటూ ట్విట్టర్ వేదిగా విపక్షాల తీరుపై మండిపడ్డారు.

యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 14న రెండో విడత ఎన్నికలు, ఫిబ్రవరి 20న మూడో విడత, ఫిబ్రవరి 23న నాలుగో విడత, ఫిబ్రవరి 27న ఐదో విడత, మార్చి 3న ఆరో విడత, మార్చి 7న ఏడో విడత(చివరి) ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు మార్చి 10న చేపట్టనున్నారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల పూర్తి కవరేజీ ఇక్కడ చదవండి.. 

Also Read..

Coronavirus: భారత్ లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్.. భారీగా వెలుగు చూస్తోన్న కేసులు..

NeoCov Virus: వామ్మో.. పురుడుపోసుకున్న మరో ప్రమాదకర వైరస్.. సోకిన ముగ్గురిలో ఒకరు మృతి..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu