Himaja: విడాకుల వదంతులపై స్పందించిన హిమజ.. ఇన్ స్టా వీడియోలో ఏం చెప్పిందంటే..

హిమజ (Himaja).. అటు వెండితెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక  బిగ్ బాస్(Biggboss) రియాలిటీ షో తో మరింత మందికి చేరువైన ఈ బ్యూటీ సోషల్ మీడియా (social media) లోనూ ఎంతో చురుగ్గా ఉంటుంది.

Himaja: విడాకుల వదంతులపై స్పందించిన హిమజ.. ఇన్ స్టా వీడియోలో ఏం చెప్పిందంటే..
Himaja
Follow us
Basha Shek

|

Updated on: Jan 28, 2022 | 1:06 PM

హిమజ (Himaja).. అటు వెండితెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక  బిగ్ బాస్(Biggboss) రియాలిటీ షో తో మరింత మందికి చేరువైన ఈ బ్యూటీ సోషల్ మీడియా (social media) లోనూ ఎంతో చురుగ్గా ఉంటుంది. అయితే ఇటీవల ఈ సొగసరికి సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే..హిమజ త్వరలో తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందన్న వార్తలు బాగా హల్ చల్ చేస్తున్నాయి. నిజానికి అసలు హిమజకు వివాహమైందా లేదా అన్న విషయంపై ఇంతవరకు ఎవరికీ స్పష్టత లేదు. ఎందుకంటే ఆమె తన వివాహం, భర్త గురించి ఎప్పుడు కూడా బయట చెప్పలేదు.  అయితే గూగుల్ లో మాత్రం ఆమెకు ఇది వరకే పెళ్లైందని, అతనితో విడిపోయిందని, ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుందని, ఇప్పుడు మరోసారి విడాకులు తీసుకుంటుందన్న వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న ప్రచారంపై హిమజ స్పందించింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది. అందులో తనపై వస్తోన్న వదంతులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

నన్ను కూడా పిలవండి..

‘ నేనేదో నా షూటింగ్‌లో బిజీగా ఉంటుంటే కొందరు నా స్నేహితులు  కొన్ని వీడియో లింక్‌లు పంపారు. అందులో  ‘హిమజ భర్తతో విడాకులు తీసుకుంటుంది’  అనే వార్తలున్నాయి. ఏంటో ఇటీవల మనుషులు లేకుండా యూట్యూబ్‌, సోషల్ మీడియాల్లో పెళ్లిళ్లు చేసి, విడాకులు కూడా ఇచ్చేస్తున్నారు. ఇలాంటి  అసత్య వార్తల గురించి నేను పట్టించుకోను. కానీ  ఇంట్లోని అమ్మానాన్నలు మనలా ఉండరుగా.  కాస్త సున్నితంగా ఉంటారు. ఇలాంటి వదంతులు, వార్తల వల్ల వారి మనసు బాధపడుతుంది.  కంగారు పడతారు.  దయచేసి ఇలాంటి వార్తలు షేర్ చేయడం మానుకోండి.  ఒకవేళ నాకు పెళ్లి చేసినా, విడాకులు ఇప్పించినా ఆ కార్యక్రమాలకు  కొంచెం నన్ను కూడా పిలవండి’ .

అప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటా!

ప్రస్తుతం  నా పనేదో నేను చేసుకుంటున్నాను. సంతోషంగా ఉన్నాను.  ఫ్యామిలీని కూడా  హ్యాపీగా చూసుకుంటున్నా.  మీరు అన్నట్లు ఓ నాలుగేళ్లు  తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. మంచి గుళ్లో.. అందమైన పూల అలంకరణల మధ్య చాలా గ్రాండ్‌గా  పెళ్లి పీటలెక్కుతాను.  అయితే ఒకరిపై ఇలా వదంతులు షేర్ చేసేటప్పుడు, కామెంట్‌ చేసేటప్పుడు వారికి ఓ కుటుంబం ఉంటుంని ఆలోచించండి.   తెలియకుండా చేసే తప్పుల వల్ల వారు  బాధపడతారన్న విషయం గ్రహించండి’ అని వీడియోలో చెప్పుకొచ్చింది హిమజ. తద్వారా తనపై వస్తోన్న వార్తలకు చెక్ పెట్టిందీ అందాల తార.

View this post on Instagram

A post shared by Himaja? (@itshimaja)

Also read: Devulapalli Subbaraya Sastri: డుంబు సృష్టికర్త ఇక లేరు.. చైన్నైలో కన్నుమూసిన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి ..

Crime News: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య..

Coronavirus: కొవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్.. బెడ్ పై నుంచి లేవలేకపోతున్నానంటూ..