AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramasur Movie: ఓటీటీలో దూసుకుపోతున్న రామ్ అసుర్.. అమెజాన్ ప్రైమ్‏లో ట్రెండింగ్‏లో టాప్..

కంటెంట్ నచ్చితే చాలు.. చిన్న సినిమాకైనా పట్టం కట్టేస్తున్నారు ప్రేక్షకులు. స్టోరీ కాస్త వేరుగా.. ఇంట్రెస్టింగ్‏గా అనిపిస్తే...

Ramasur Movie: ఓటీటీలో దూసుకుపోతున్న రామ్ అసుర్.. అమెజాన్ ప్రైమ్‏లో ట్రెండింగ్‏లో టాప్..
Ramasur
Rajitha Chanti
|

Updated on: Jan 28, 2022 | 8:45 PM

Share

కంటెంట్ నచ్చితే చాలు.. చిన్న సినిమాకైనా పట్టం కట్టేస్తున్నారు ప్రేక్షకులు. స్టోరీ కాస్త వేరుగా.. ఇంట్రెస్టింగ్‏గా అనిపిస్తే… చిన్న సినిమా అయినా సూపర్ హిట్ చేసేస్తున్నారు. ఇక ఓటీటీల పుణ్యమా అని చిన్ని సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో మంచి టాక్ సంపాదించుకున్న చిత్రాలను ఓటీటీలో ఆదరిస్తున్నారు. అంతేకాదు.. బారీ బడ్జెట్ సినిమాలను సైతం వెనక్కు నెట్టి ట్రెండింగ్‏లో దూసుకుపోతున్నాయి. ఇక డిజిటల్ రంగంలో చిన్న సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ కోవలోకి చెందినదే రామ్ అసుర (Ramasur) సినిమా.

అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్, చాందినీ, షానీ సల్మాన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం రామ్ అసుర. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‏లో విడుదలైన భారీ బడ్జెట్ చిత్రాలతో పోటీగా దూసుకుపోతూ ట్రెండింగ్‏లో సెకండ్ ప్లేస్‏లో నిలిచింది. తెలుగు మూవీస్, క్యాటగిరీలోనూ.. రామ్ అసుర్ సినిమా రెండవ స్థానంలో నిలిచింది. ఆర్టిఫీషియల్ డైమండ్ ను రూపొందించాలనుకున్న ఇద్దరి సైంటిస్టుల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే కాన్సెప్ట్‏తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ క్రియేటివ్ కథాంశంతోపాటు.. అందమైన లవ్ స్టోరీ కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో అభినవ్ సర్ధార్, చాందినీల ప్రేమ కథ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసింది. ఈ చిత్రానికి వెంకటేశ్ త్రిపర్ణ దర్శకత్వం వహించగా. అభినవ్ సర్దార్ నిర్మించారు.

Also Read: Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ అయ్యేది అప్పుడే.. విడుదల తేది ప్రకటించిన చిత్రయూనిట్..

Viral Photo: ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. కళ్లతోనే కట్టిపడేస్తుంది.. ఎవరో గుర్తుపట్టారా.?

Allu Shirish: మల్టీస్టారర్ ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లువారబ్బాయి.. మరో హీరో ఎవరంటే..

Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే