Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..
దివంగత అగ్రకథానాయిక శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor).. బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది.
దివంగత అగ్రకథానాయిక శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor).. బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది. ధడక్ (Dhadak) సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అందం.. అభినయంతో సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే శ్రీదేవి (Sridevi) వారసురాలిగా టాలీవుడ్లోకి జాన్వీ ఎంట్రీ ఇస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తెలుగులో జాన్వీని పరిచయం చేసేందుకు చాలా మంది దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్ నడిచింది. తాజాగా జాన్వీ కపూర్ ఎంట్రీ కన్ఫార్మ్ అయినట్లు ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది.
మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించబోయే జనగణమన సినిమాలో జాన్వీ నటించనున్నట్లుగా టాక్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో పూరీ తెరకెక్కించబోయే ఈ మూవీలో జాన్వీని హీరోయిన్గా తీసుకోనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే విజయ్… జాన్వీతో చర్చలు కూడా జరిపినట్లుగా సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్నారు. బాక్సింగ్ నేపధ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా తర్వాత విజయ్.. పూరీ జగన్నాథ్ కాంబోలో రానున్న జనగణమన సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.
Also Read: Sweta Varma: బుల్లెట్ బండిని కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. రైడ్ కు వెళ్లే టైమొచ్చిందంటూ..
Anupama parameswaran: క్యూట్ ఎక్స్‌ప్రెషన్లు తో క్యూట్ స్మైల్ తో ఎట్రాక్ట్ చేస్తున్న అనుపమ..
Himaja: విడాకుల వదంతులపై స్పందించిన హిమజ.. ఇన్ స్టా వీడియోలో ఏం చెప్పిందంటే..
Teaser Talk: రాక్షసుడిని చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి.. ఆసక్తికరంగా భళా తందనాన టీజర్..