Nagarjuna: ది ఘోస్ట్ కోసం దుబాయ్‌కి నాగార్జున.. యాక్షన్ సన్నివేశాలు అక్కడే..
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) యంగ్ హీరోస్‌కు గట్టి పోటీనిస్తున్నారు. వరుస చిత్రాలను
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) యంగ్ హీరోస్‌కు గట్టి పోటీనిస్తున్నారు. వరుస చిత్రాలను లైన్లో పెట్టి దూసుకుపోతున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భగా బంగార్రాజు (Bangarraju) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు నాగ్. దీంతో ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. గరుడవేగ ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ది ఘోస్ట్ (The Ghost) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగ్.. రిటైర్డ్ రా ఏజెంట్ పాత్రలో కనిపించన్నారు. ఇందులో నాగార్జున పూర్తిగా విభిన్న లుక్‌లో కనిపించనున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమయిన.. అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది.
తాజాగా ఇప్పుడు మరోసారి ఈ సినిమా పట్టాలెక్కనుంది. ది ఘోస్ట్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు నాగార్జున అండ్ టీం దుబాయ్ వెళ్లనున్నారు. అక్కడే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. నాగార్జునతోపాటు.. సోనాల్‌చౌహాన్ ఇందులో పాల్గొనబోతున్నారు. వాస్తవానికి ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా ఈ మూవీ నుంచి తప్పుకుంది. దీంతో ఈ సినిమాలో నాగ్ సరసన సోనాల్ చౌహన్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను నారాయణ్ దాస్, కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అనైక సురేంద్రన్, గుల్ పనాగ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.
Gangubai Kathiawadi: థియేటర్లలోకి గంగూబాయి కతియావాడి.. అలియా భట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..