AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangubai Kathiawadi: థియేటర్లలోకి గంగూబాయి కతియావాడి.. అలియా భట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం గంగూబాయి కతియావాడి (Gangubai Kathiawadi). అలియా భట్ (Alia Bhatt)

Gangubai Kathiawadi: థియేటర్లలోకి గంగూబాయి కతియావాడి.. అలియా భట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
Gangubai Kathiawadi
Rajitha Chanti
|

Updated on: Jan 28, 2022 | 8:14 PM

Share

బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం గంగూబాయి కతియావాడి (Gangubai Kathiawadi). అలియా భట్ (Alia Bhatt) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) దర్శకత్వం వహించారు. ఇందులో అలియా ముంభై మాఫియా క్వీన్ గంగూబాయి పాత్రలో కనిపించనుంది. సంజయ్‌ లీలా భన్సాలీ, డా. జ‌యంతిలాల్‌గ‌డ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ‌బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్‌ జైదీ రచించిన “మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై” అనే బుక్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

నార్త్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఢిల్లీతోపాటు.. పలు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి ఓపెన్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో గంగూబాయిగా అలియా భట్‌ వేశ్య గృహం నడిపే యజమానిగా నటిస్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందని గత కొద్ది రోజులుగా నెట్టింట్లో టాక్ నడుస్తోంది. దీంతో విడుదల తేదీని ప్రకటిస్తూ.. రూమర్స్‏కు చెక్ పెట్టారు మేకర్స్. ఇదిలా ఉంటే.. అలియా భట్.. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీతో అలియా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Also Read: Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ అయ్యేది అప్పుడే.. విడుదల తేది ప్రకటించిన చిత్రయూనిట్..

Viral Photo: ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. కళ్లతోనే కట్టిపడేస్తుంది.. ఎవరో గుర్తుపట్టారా.?

Allu Shirish: మల్టీస్టారర్ ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లువారబ్బాయి.. మరో హీరో ఎవరంటే..

Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..

Follow Us
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?