Allu Arjun: రేవతి కుటుంబానికి అండగా ఉంటాను.. అల్లు అర్జున్..

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాత్రంతా జైలులోనే ఉన్న బన్నీ శనివారం ఉదయం విడుదలయ్యారు. అనంతరం తన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. కాసేపటి క్రితమే ఇంటికి చేరుకున్నారు.

Allu Arjun: రేవతి కుటుంబానికి అండగా ఉంటాను.. అల్లు అర్జున్..
Allu Arjun Comments
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 14, 2024 | 9:15 AM

హైదరాబాద్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పలువురు సినీ ప్రముఖులను కలుసుకున్నారు. అనంతరం తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు అల్లు అర్జున్. ‘నేను బాగానే ఉన్నాను.. ఆందోళన చెందకండి. నేను చట్టాన్ని గౌరవిస్తాను. నిపోయిన మహిళ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను. సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఆ ఘటన జరిగింది. అలా జరగడం దురదృష్టకరం. ఆ కుటుంబానికి నేనెప్పుడు అండగా ఉంటాను. గత 20 ఏళ్లుగా ఆ థియేటర్‏కు వెళ్లి నా సినిమా చూస్తుంటాను. నా సినిమాలే కాదు మావయ్య సినిమాలు చూశాను. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. అభిమానం, ప్రేమతో నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని అన్నారు అల్లు అర్జున్.

శనివారం ఉదయం చంచల్ గూడా జైలు నుంచి విడుదలైన వెంటనే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు అల్లు అర్జున్. అక్కడ న్యాయవాదుల బృందం ఆయనతో చర్చలు జరిపింది. దాదాపు 45 నిమిషాలపాటు న్యాయవాది నిరంజన్ రెడ్డితో బన్నీ చర్చించారు. అలాగే తనను కలవడానికి వచ్చిన సినీ ప్రముఖులతో మాట్లాడారు. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ నుంచి తన ఇంటికి చేరుకున్నారు బన్నీ.

మరోవైపు బన్నీ విడుదల ఆలస్యంపై అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కీలకవ్యాఖ్యలు చేశారు. హైకోర్టు బన్నీని వెంటనే విడుదల చేయాలని ఆదేశించిందని.. అయినా సరే ఉద్దేశపూర్వకంగానే జైలులో ఉంచారని అన్నారు. ఈ విషయమై చట్టపరంగా ముందుకు వెళ్తామని.. మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. బెయిల్ వచ్చినా విడుదల ఆలస్యం చేయడంపై పోలీసులపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని బన్నీ తరపు లాయర్ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.