Allu Arjun: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్, దిల్ రాజ్.. వీడియో ఇదిగో..
సినీనటుడు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయనతోపాటు నిర్మాత దిల్ రాజు సైతం ఉన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలువుడ్ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీతేజ్ కుటుంబానితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు. అల్లు అర్జున్‌తోపాటు తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు ఉన్నారు. మరోవైపు ఆసుపత్రి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు రామ్ గోపాల్ పేట్ పోలీసులు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు అల్లు అర్జున్. అనంతరం శ్రీతేజ్ కుటుంబానికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ గత 35 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేవతి కుటుంబానికి ఎప్పటికీ తాను అండగా ఉంటానని ఇదివరకే అల్లు అర్జున్ తెలిపారు. అలాగే రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ రూ.1 కోటి, డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ చెరో రూ.50 లక్షలు ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.