AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: విలేకరి ప్రశ్నతో సీరియస్‌గా వెళ్లిపోయిన రజనీకాంత్‌.. అలాంటివి నన్ను అడగొద్దంటూ..

తమిళనాడులో చాలా మంది నటీనటులు అన్నా యూనివర్సిటీ అంశంపై మాట్లాడటానికి నిరాకరిస్తూన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై అటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ విషయంపై సినీపరిశ్రమలో గట్టిగానే మాట్లాడాలి అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రజినీకాంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Rajinikanth: విలేకరి ప్రశ్నతో సీరియస్‌గా వెళ్లిపోయిన రజనీకాంత్‌.. అలాంటివి నన్ను అడగొద్దంటూ..
Rajinikanth
Rajitha Chanti
|

Updated on: Jan 07, 2025 | 1:01 PM

Share

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం కూలీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయన షూటింగ్ కోసం ఈరోజు థాయ్ లాండ్ వెళ్లారు. ముందుగా చెన్నై విమానాశ్రయంలో ప్రెస్ మీట్ పెట్టిన రజనీకాంత్.. కూలీ షూటింగ్ జనవరి 13 నుంచి 25 వరకు థాయ్‌లాండ్‌లో జరగనుందని చెప్పారు. ఇప్పటి వరకు 70 శాతం షూటింగ్ పూర్తయిందని తెలిపారు. దీంతో తమిళనాడులో మహిళల భద్రతపై విలేకరులు ఆయనను అడిగే ప్రయత్నం చేశారు. అయితే విలేకరుల ప్రశ్నలను అడ్డగిస్తూనే.. “రాజకీయ ప్రశ్నలు అడగవద్దని ఇప్పటికే మీకు చెప్పాను” అంటూ కాస్త కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహిళల భద్రతకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రాజకీయాలు వద్దు అంటూ రజనీకాంత్ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజనీకి వ్యతిరేకంగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

అంతకుముందు రజనీ విమానాశ్రయానికి రాగానే అక్కడి నుంచి అభిమానులు తలైవా అంటూ నినాదాలు చేయడంతో సందడి నెలకొంది. తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్, లియో తర్వాత నటుడు రజనీకాంత్‌తో కూలీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ మూవీ నిర్మిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, చౌబిన్ సాహిర్ సత్యరాజ్, శృతి హాసన్, రెబా మోనికా జాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వీరితో పాటు నటుడు అమీర్ ఖాన్ అతిధి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

గతేడాది 2019లో మాస్టర్‌ సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ హఠాత్తుగా నటుడు రజనీకాంత్‌ను కలిశారు. అప్పుడే రజినీకి కూలీ కథ వినిపించారు. ఆ సమయంలో రజినీ జైలర్ సినిమాలో నటించేందుకు అంగీకరించడంతో ఈ సినిమా వాయిదా పడింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం.

Source:

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.