Kamna Jethmalani: నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్.. ఎంతగా మారిపోయిందో చూశారా..?

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత వరుస ఆఫర్స్ కొట్టేసిన తారల గురించి చెప్పక్కర్లేదు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు.

Kamna Jethmalani: నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్.. ఎంతగా మారిపోయిందో చూశారా..?
Kamna Jethmalani
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 07, 2025 | 9:37 AM

కామ్నా జెఠ్మలానీ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ గోపిచంద్ మూవీ రణం హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రింగుల జుట్టు.. చూడచక్కని రూపం, అందమైన నటనతో తెలుగు ప్రజలను కట్టిపడేసింది. తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మ్యాచో స్టార్ గోపిచంద్ సరసన రణం సినిమాలో నటించింది. ఈ మూవీ గోపిచంద్ కెరీర్ లోనే వన్ ఆఫ్ హిట్ గా నిలిచింది. అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీతోనే కామ్నా జెఠ్మలానీకి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది.

ఈ మూవీ తర్వాత అల్లరి నరేష్ జోడిగా బెండప్పారావు సినిమాలో నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన కామ్నా జెఠ్మలానీ ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యింది. తెలుగు, కన్నడ, తమిళంలో నటించి మెప్పించిన కామ్నా జెఠ్మలానీ.. 2014 ఆగస్ట్ 11న బెంగుళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సూరజ్ నాగ్ పాల్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.

ప్రస్తుతం కామ్నా జెఠ్మలానీ ఫోటోస్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్. ఒకప్పుడు ఎంతో ముద్దుగా.. ట్రెడిషనల్ బ్యూటీగా కనిపించిన ఈ అమ్మడు.. పూర్తిగా సన్నబడిపోయి గ్లామర్ ఫోజులతో మెంటలెక్కిస్తోందని.. రీఎంట్రీ ఇవ్వచ్చుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

View this post on Instagram

A post shared by Kamna Jethmalani (@kamana10)

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.