Tollywood: చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ.. పెళ్లి తర్వాత హిట్టు కొట్టింది..
ఆమె నటించిన తొలి చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే అందం, అభినయంతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఆ అమ్మడు..ఆ తర్వాత మాత్రం వరుస ప్లాప్స్ అందుకుంది. అదే సమయంలో రూ.900 కోట్ల ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ, పెళ్లి. ఇంతకీ ఎవరంటే..
విభిన్న రంగాలకు చెందినవారిని జీవితభాగస్వాములుగా పొందిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. సినీరంగానికి చెందిన వారు కాకుండా బిజినెస్, రాజకీయం ఇలా ఇతర రంగాల్లో పాపులారిటీ ఉన్న వ్యక్తులను పెళ్లి చేసుకుని ఇప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది నటీమణులు పెళ్లి తర్వాత తమ కెరీర్‌ను విడిచిపెట్టి, తమ ఇంటికే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. మరికొందరు మాత్రం పెళ్లి తర్వాత సైతం వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. పెళ్లికి ముందు ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. కానీ వివాహం తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఆమె నటించిన తొలి చిత్రం హిట్ అయ్యింది. దీంతో కెరీర్ తొలినాళ్లలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. అయితే ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. ఏకంగా 9 సినిమాలు నిరాశపరిచాయి. అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ సరసన మూవీని కూడా రిజెక్ట్ చేసింది. కట్ చేస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అయితే వరుసగా ప్లాప్స్ అందుకుంటున్న సమయంలోనే ఓ రాజకీయ నాయకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా.
ఎన్నో ఫ్లాప్ చిత్రాలు ఉన్నప్పటికీ, కొంతమంది తారలు బాలీవుడ్‌లో తమ స్థానాన్ని సంపాదించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అందులో పరిణీతి చోప్రా ఒకరు. 2011లో ‘లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్’తో తొలిసారిగా నటించింది. ఈ సినిమాకు ఉత్తమ మహిళా అరంగేట్రం ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత ఈ చిత్రాల్లో నటించినప్పటికీ ఆమె సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా ఆఫర్ తనకు వచ్చిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కానీ తాను ఆ సినిమాను రిజెక్ట్ చేసింది.
ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమలో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. 2023 సెప్టెంబర్ 24న ఉదయ్ పూర్ లో వీరిద్దరి వివాహం జరిగింది. రాఘవ్ చద్దాతో వివాహమైన తర్వాత తన జీవితంలో చాలా సానుకూల మార్పులు వచ్చాయని పరిణితి తెలిపింది. పెళ్లి తర్వాత పరిణితి నటించిన చమ్కిలా సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో ఆమె నటనపై ప్రశంసలు వచ్చాయి. యానిమల్ సినిమాను తిరస్కరించినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని కూడా పరిణీతి చెప్పింది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.