Naga Chaitanya: బ్రేకప్ బాధేంటో నాకు తెలుసు.. సమంతతో విడాకులపై మరోసారి ఓపెన్ అయిన చైతూ..
ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చేసింది తండేల్. పాన్ ఇండియా లెవల్లో డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 7న) అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

తండేల్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు అక్కినేని నాగచైతన్య. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నాగచైతన్య , సాయి పల్లవి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. మొత్తానికి తండేల్ సినిమా మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమాకు ఇప్పుడు మరిన్ని కలెక్షన్స్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే వరుస ప్రమోషన్లలతో జనాలను ఆకట్టుకున్నారు చైతన్య. తండేల్ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో చైతన్యతోపాటు సాయి పల్లవి, డైరెక్టర్ చందు మొండేటి సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన ఫస్ట్ మ్యారేజ్, విడాకుల గురించి స్పందించారు. సమంతతో విడాకుల గురించి వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
“ఎంతో గౌరవంగా బయటకు వచ్చే విడాకుల ప్రకటన చేశాము. మేము మాకు ప్రైవసీ కావాలని కూడా అడిగాము. కానీ అది ఒక ఎంటర్టైన్మెంట్ లా మారిపోయింది. ఓ బ్రేకప్ జరిగితే ఎలాంటి పరిణామాలు వస్తాయి.. ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుంది అనేది నాకు తెలుసు. నేనూ కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. మేం ఏమీ ఓవర్ నైట్ లో నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునేముందు వెయ్యి సార్లు ఆలోచించాం. మేం ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఎవరి దారి వారి చూసుకున్నాం. ఎవరి జీవితాలు వాళ్లు గడిపేస్తున్నాం. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు. కానీ వచ్చింది. ఏం జరిగిన దానికంటూ ఓ కారణం ఉంటుంది కదా. నా గురించి ఆలోచించడం కాకుండా మీ లైఫ్ మీద ఇన్వెస్ట్ చేయండి.. ” అంటూ చెప్పుకొచ్చారు చైతన్య.
అలాగే తన పెళ్లి సమయంలో శోభిత పై వచ్చిన కామెంట్స్ గురించి రియాక్ట్ అయ్యారు. కేవలం ఇన్ స్టా ద్వారా ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందని అన్నారు. తనకు తన గతంతో ఎలాంటి సంబంధం లేదని.. అయినప్పటికీ తనను విమర్శించారని.. ఆ సమయంలో చాలా బాధగా అనిపించిందని అన్నారు నాగచైతన్య.
Akkineni Naga Chaitanya on divorcing Samantha Ruth Prabhu
"I will think 1000 times to break a Relationship."#NagaChaithanya #Samantha#Thandel pic.twitter.com/eGWQpGioFn
— Binge Wire (@BingeWire) February 7, 2025
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన