OTT Movie: ఓటీటీలోకి ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీ సినీప్రియులను ఆకట్టుకోవడానికి మేకర్స్ ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలను తీసుకువస్తున్నారు. ఇప్పటికే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, హారర్ చిత్రాలతోపాటు పొట్టచెక్కలయ్యే కామెడీ సినిమాలను సైతం రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ప్రేక్షకుల ముందుకు తెలుగు ట్రయాంగిల్ సినిమాను తీసుకువస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసా.. ?

ఓటీటీల్లోకి ఈమధ్య కొత్త సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అలాగే అటు పాత సినిమాలను సైతం మేకర్స్ మరోసారి స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వాలెంటైన్ వీక్ సందర్భంగా రొమాంటిక్ ప్రేమకథ చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నాయి. లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా స్టోరీస్ చూసేందుకు ప్రేక్షకులు సైతం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలు లవ్ స్టోరీస్ సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో హిట్ మూవీ అడియన్స్ ముందుకు వస్తోంది. అదే ఓ ట్రయాంగిల్ ప్రేమకథ సమ్మేళనం. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ లో ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.
“సమ్మేళనం.. ప్రేమ.. నవ్వులు.. క్రేజీ లవ్ ట్రయాంగిల్.. గందరగోళం మొదలైంది. ఫిబ్రవరి 20 నుంచి ఈటీవీ విన్ లో ” అంటూ క్యాప్షన్ ఇస్తూ సమ్మేళనం సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. కొత్త నటీనటులతో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. పోస్టర్ లో ఐదుగురు ప్రధాన పాత్రదారుల చుట్టూ ఈ కథ మొత్తం తిరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
ఈ సినిమాతోపాటు ఈటీవీ విన్ ఓటీటీలో మరికొన్ని లవ్ స్టోరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే పాత, కొత్త కలిపి మొత్తంగా 40 సినిమాలను ఓటీటీ లవర్స్ ముందుకు తీసుకురానున్టన్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమాలకు సంబంధించిన పూర్తి జాబితాను వెల్లడిస్తూ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
#Sammelanam Love, laughter, and a crazy love triangle let the confusion begin! ❤️😂From Feb 20 on @etvwin#Etvwin@BigFishMedias pic.twitter.com/bfiFsvvngE
— ETV Win (@etvwin) February 7, 2025
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన