Pushpa 2 : ‘పుష్ప 2 సినిమాతో నేషనల్ అవార్డు పట్టేస్తా’.. శ్రీవల్లి పాత్రపై రష్మిక కామెంట్స్

'పుష్ప1 ది రైజ్ సినిమాలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు 'పుష్ప 2' సినిమాతో తనకు కూడా కచ్చితంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు వస్తుందంటోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

Pushpa 2 : 'పుష్ప 2 సినిమాతో నేషనల్ అవార్డు పట్టేస్తా'.. శ్రీవల్లి పాత్రపై రష్మిక కామెంట్స్
పూజా హెగ్డే లాంటి బ్యూటీస్ ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాల్లో ఫ్లాష్ అయినా... బెస్ట్ పర్ఫామర్‌ అన్న పేరు రాలేదు. దీనికి తోడు పూజ నటించిన పాన్ ఇండియా సినిమాలు ఫ్లాప్ అవ్వటంతో ఈ బ్యూటీ మెయిన్‌ స్ట్రీమ్‌ కాంపిటీషన్‌ లో లేకుండా పోయారు.
Follow us
Basha Shek

|

Updated on: Nov 29, 2024 | 9:26 PM

రష్మిక మందన్న ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కన్నడ సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ సాగింది. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ముద్దుగుమ్మకు మంచి డిమాండ్ ఉంది. తన అభినయ ప్రతిభకు ప్రతీకగా ఇప్పటికే ప్రశంసలు, పురస్కారాలు కూడా సొంతం చేసుకుంది. అయితే పుష్ప 2 సినిమాతో జాతీయ అవార్డు కూడా తన ఖాతాలోకి వస్తోందని ధీమాగా చెబుతోంది రష్మిక మందన్నా. ‘పుష్ప’లో తన నటనకు ‘ఉత్తమ నటుడిగా’ జాతీయ అవార్డును అందుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు ‘పుష్ప 2’లో నటించిన రష్మికకు జాతీయ అవార్డు వస్తుందా? అని కొందరు విలేకరులు రష్మికను ప్రశ్నించారు. దీనికి ఆమె ‘కచ్చితంగా వస్తుందనుకుంటున్నా’ అని చిరునవ్వు నవ్వింది. కాగా ఇదే కార్యక్రమంలో ఆమె ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి’ పాటకు స్టేజ్‌పై స్టెప్పులేసింది రష్మిక. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజి కమాధ్యమాల్లో వైరల్ గా మారాయి. కాగా ‘పుష్ప 2’లో రష్మిక మందన్న పాత్ర ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఉంది. దీనికి కారణం ఉంది. ఎందుకంటే, పుష్ప 2 శ్రీవల్లి పాత్ర చనిపోతుందని ప్రచారం జరుగుతోంది. సినిమా రిలీజయ్యాక కానీ దీనిపై క్లారిటీ రాదు.

ఇవి కూడా చదవండి

జాతీయ అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అవార్డుల్లో ఇది ఒకటి. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు అవార్డులను కూడా అందజేస్తుంది. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా రిషబ్‌ శెట్టి, ఉత్తమ నటిగా నిత్యా మీనన్‌ ఎంపికయ్యారు.

పుష్ప 2 సినిమాలో రష్మిక..

డిసెంబర్ 5న ‘పుష్ప 2’ సినిమా విడుదల కానుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, డాలీ ధనంజయ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుకుమార్ నిర్వహించారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చారు.

రష్మిక లేటెస్ట్ ఫొటోస్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?