AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. భారీగా తగ్గుతున్న బంగారం ధర

Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. భారీగా తగ్గుతున్న బంగారం ధర

Phani CH
|

Updated on: Mar 23, 2026 | 8:37 PM

Share

గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు గణనీయంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు పెట్టుబడిదారులను వెనకడుగు వేయించాయి. దీని ఫలితంగా పసిడి ధరలు 4 నెలల కనిష్టానికి పడిపోయాయి. భారత మార్కెట్లో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.5,950 తగ్గింది. కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశం.

గత కొంతకాలంగా సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి మెరుపులు తగ్గుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాల వల్ల పెట్టుబడిదారులు వెనకడుగు వేయడంతో ధరలు భారీగా పతనమవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా తొమ్మిదో రోజూ పతనాన్ని కొనసాగించాయి. సోమవారం ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 4,377.95 డాలర్లకు పడిపోయింది. ఇది గత నాలుగు నెలల్లోనే అతి తక్కువ ధర కావడం గమనార్హం. గత వారంలో ఇదే ధర 5,000 డాలర్ల మార్కును దాటడం విశేషం. పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తూ 65.74 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మార్చి 23 సోమవారం భారత్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.5,950లు తగ్గి, రూ.1,40,020 లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.5,450లు తగ్గి, రూ.1,28,350లు పలుకుతోంది. కిలో వెండిపై రూ.20,000 తగ్గి, రూ.2,30,000లు గా కొనసాగుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో సోమవారం బంగారం, వెండిధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,110 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,33,940 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,45,960 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,33,790 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,570 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,36,190 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,960 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,790 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,30,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: చలాకీగా సందడి చేస్తున్న రష్మిక మందన్న

Dhurandhar 2: బెస్ట్ టాక్‌ తో దూసుకుపోతున్న ధురంధర్2

పదేళ్ల ప్రస్థానం గురించి మాట్లాడిన భూమి ఫడ్నేకర్

2026లో అందాల భామల ఆశలు నెరవేరేనా ??

ఆల్ రౌండర్స్ అయిపోతున్న హీరోయిన్లు.. సినిమాల్లో సత్తా చాటుతున్న బ్యూటీస్

Follow Us