పదేళ్ల ప్రస్థానం గురించి మాట్లాడిన భూమి ఫడ్నేకర్
భూమి ఫడ్నేకర్ బాలీవుడ్ ప్రయాణం కేవలం అందం, గ్లామర్లకే పరిమితం కాదు. ప్రియాంక చోప్రాను స్ఫూర్తిగా తీసుకుని, కెరీర్‌లో ఎదురైన ఆరోగ్య సవాళ్లను, 'ది లేడీ కిల్లర్' వంటి నిరాశలను అధిగమించి, తనను తాను నిరంతరం అప్‌డేట్ చేసుకుంటూ, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై దృష్టి పెడుతున్న వైనం ఆమె పట్టుదలకు నిదర్శనం.
సినిమా హీరోయిన్ అనగానే అందరం ఆమె అందం గురించి, ఫేమ్ గురించి, ఎంత ఫామ్‌లో ఉన్నారా అనే విషయాన్ని గురించి, లగ్జరీ గురించి, కాస్ట్యూమ్స్ గురించి, ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుంటాం. కానీ, చాలా అరుదుగా వాళ్లు గో త్రూ అవుతున్న విషయాలు చర్చలోకి వస్తాయి. వాళ్లు తమను తాము అప్‌డేట్ చేసుకునే తీరు ఒకింత ఇన్‌స్పయిరింగ్‌గా ఉంటుంది. ఈ విషయంలో బాలీవుడ్ నాయిక భూమి ఫడ్నేకర్ ఏం చెబుతున్నారు. ప్రియాంకను ఈ ఇష్యూలో ఎందుకు ప్రస్తావించారు? చూసేద్దాం వచ్చేయండి. ప్రియాంక చోప్రా అంటే నాకు చాలా ఇష్టం అని ఓపెన్ అయ్యారు బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్. ఎవరికీ ఏ స్థాయీ ఊరికే రాదని అంటున్నారు భూమి. అందుకే ఎన్నో విషయాలు తాను ప్రియాంక చోప్రాను స్ఫూర్తిగా తీసుకుంటానని చెబుతున్నారు. బాలీవుడ్‌లో భూమి ఫడ్నేకర్ అడుగుపెట్టి దశాబ్దం అయింది. తాను చేసిన పాత్రల కోసం ఫిజికల్ గా ఎంతో మారానని అంటున్నారు. దీని వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు తెలిపారు. కెరీర్ లో అడుగుపెట్టిన కొత్తలో రివ్యూల కోసం ఎదురుచూసేదాన్నన్నారు భూమి. మౌత్ టాక్‌తో ఆడిన సినిమాలు, వాటి వల్ల నిలబడ్డ హీరోల గురించి కూడా తనకు బాగా తెలుసన్నారు. కెరీర్‌లో తనను డిజప్పాయింట్ చేసిన మూవీ ‘ది లేడీ కిల్లర్’ అని చెప్పారు. కథ చెప్పినప్పుడు, తాను చదివినప్పుడు సంపూర్ణంగా ఉందని, కానీ, సగం సగం తెరకెక్కించి రిలీజ్ చేశారని, సినిమా చూసి చాలా బాధపడ్డానన్నారు. మేకింగ్‌లోనూ తాను పార్టిసిపేట్ చేసి ఉంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదనిపించిందని తెలిపారు. తన చేతిలో లేని విషయం గురించి ఆలోచించడం వేస్ట్ అని, అందుకే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండాలనుకున్నానని చెప్పారు. ప్రస్తుతం ఏఐ మీద ఫోకస్ చేస్తున్నానన్నారు ఈ లేడీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2026లో అందాల భామల ఆశలు నెరవేరేనా ??
ఆల్ రౌండర్స్ అయిపోతున్న హీరోయిన్లు.. సినిమాల్లో సత్తా చాటుతున్న బ్యూటీస్
హిట్టు కొట్టు గురూ.. లేకపోతే అంతే సంగతులు.. కుర్ర హీరోలకు అల్టిమేటం
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

