AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాన్ ఇండియన్ సినిమాలకు సౌత్ బ్యూటీస్ పనికిరారా..?

పాన్ ఇండియన్ సినిమాలకు సౌత్ బ్యూటీస్ పనికిరారా..?

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 23, 2026 | 7:32 PM

Share

ప్యాన్ వరల్డ్, ప్యాన్ ఇండియా సినిమాల్లో దక్షిణాది హీరోయిన్లకు చోటు కరువవుతోంది. బడ్జెట్ పెరిగితే బాలీవుడ్ భామలనే ఎంచుకుంటున్నారు దర్శకులు. అంతర్జాతీయ మార్కెట్, బిజినెస్ లాజిక్‌ల పేరుతో దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా వంటి వారికి పెద్ద పీట వేస్తున్నారు. ఒకప్పుడు సౌత్ బ్యూటీస్ కనిపించినా, ఇప్పుడు బాలీవుడ్ ఆధిపత్యమే స్పష్టంగా కనిపిస్తోంది.

ప్యాన్ వరల్డ్ సినిమాలకు సౌత్ హీరోయిన్లు సరిపోరా..? దక్షిణాది భామలను కనీసం లెక్కలోకి కూడా తీసుకోవడం మానేసారా మన దర్శకులు..? బడ్జెట్ పెరిగితే బాలీవుడ్ బ్యూటీస్ దిగాల్సిందేనా…? ప్యాన్ వరల్డ్ సినిమాలు చేసే దర్శకులు.. సౌత్ ముద్దుగుమ్మల వైపు ఎందుకు చూడట్లేదు..? వాళ్లుంటే బిజినెస్ వర్కవుట్ అవ్వదా..? అసలేంటి లాజిక్.. చూద్దాం పదండి ఎక్స్‌క్లూజివ్‌గా..! తెలుగు సినిమా అంటే ఒకప్పుడు రష్మిక, సమంత, శృతి హాసన్ లాంటి బ్యూటీస్‌ కనబడేవాళ్లు.. కానీ ఇప్పుడలా కాదు.. అంతా బాలీవుడ్ భామల హవానే కనిపిస్తుంది. AA22లో దీపికా పదుకొనేతో పాటు మృణాల్‌, రష్మిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా అనుష్క శర్మ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. రెండేళ్ళ కింద కల్కిలోనూ పాన్ ఇండియా అప్పీల్ కోసం దీపికా పదుకొనేను తీసుకున్నారు మేకర్స్. రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసిలో ఏకంగా గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసి, అక్కడ మార్కెట్ కోసమే మేకర్స్ ఈ రేంజ్‌లో స్కెచ్ వేసారు. తెలుగులో ప్రియాంక చోప్రా నటిస్తున్న తొలి సినిమా ఇదే.. మహేష్ బాబుతో పాటు ఇప్పటికే వారణాసి గ్లోబల్ ప్రమోషన్స్ షురూ చేసారు ప్రియాంక. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్‌లో కూడా బాలీవుడ్ భామలకే పెద్ద పీట వేశారు. యానిమల్‌తో నేషనల్ క్రష్‌గా మారిన తృప్తి దిమ్రితో పాటు.. ఐశ్వర్య దేశాయ్ అనే మరో బాలీవుడ్ బ్యూటీ ఈ సినిమాలో నటిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ కేరాఫ్ బాలీవుడ్డే.. ఇద్దరికీ అక్కడ అదిరిపోయే క్రేజ్ ఉంది. జాన్వీ కపూర్‌కు హిందీ కంటే తెలుగులోనే బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ పెద్దితో పాటు జూనియర్ ఎన్టీఆర్ దేవర 2 లాంటి బడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ టాలీవుడ్‌లో బిజీ అయిపోయారు. ఇదంతా చూస్తుంటే.. పాన్ ఇండియా సినిమాలకు హీరోలు మన దగ్గర చూసుకుంటే.. హీరోయిన్లు నార్త్‌లో చూసుకుంటారని మేకర్స్ గట్టిగా ఫిక్స్ అయినట్లు అర్థమవుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యంగ్ హీరోలకు అసలైన అగ్నిపరీక్ష

పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??

Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం

BIKER Trailer : బైకర్‌ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్‌

స్పీడ్ పెంచుతున్న యంగ్ హీరోలు.. ఒకేసారి రెండు మూడు కథలు లైన్‌లో పెడుతున్నారు

Follow Us