AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం  కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం

Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 23, 2026 | 6:36 PM

Share

ఈ మధ్య పెద్ద సినిమాలకు లీకుల సమస్య తీవ్రంగా మారింది. మహేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల చిత్రాలకూ ఇది తప్పడం లేదు. అయితే, అల్లు అర్జున్ నటిస్తున్న AA22 విషయంలో దర్శకుడు అట్లీ ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ముంబై స్టూడియోలో షూటింగ్, కట్టుదిట్టమైన నియమాలతో బన్నీ లుక్‌ను రహస్యంగా ఉంచుతున్నారు. ఇది ఇతర దర్శకులకు ఆదర్శంగా నిలుస్తోంది.

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలను లీకుల సమస్య వెంటాడుతోంది. సెట్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒకరకంగా షూటింగ్ స్టిల్స్‌, ఆర్టిస్ట్‌ల లుక్స్‌ రివీల్ అయిపోతున్నాయి. మహేష్ వారణాసి, ప్రభాస్‌ స్పిరిట్ సినిమాలకు కూడా ఈ సమస్య తప్పలేదు. కానీ ఈ విషయంలో ఒక్కరు మాత్రం లీకు వీరుల బారిన పడకుండా తప్పించుకుంటున్నారు. ఎవరా ఒక్కరు అనుకుంటున్నారా..? అయితే వాచ్‌ దిస్‌ స్టోరి. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్‌ మూవీ ఏఏ 22. పుష్ప 2తో నేషనల్ మార్కెట్‌ను షేక్‌ చేసిన బన్నీ, నెక్ట్స్ మూవీతో గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీ సబ్జెక్ట్‌ను అంతకు మించిన భారీ స్కేల్‌లో రూపొందిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి రెండు టీజర్స్ వచ్చాయి. బన్నీ, అట్లీ కనిపించిన తొలి టీజర్లో టెక్నికల్‌గా సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఆ తరువాత రిలీజ్ చేసిన టీజర్‌లో హీరోయిన్ దీపిక పదుకోన్‌ను పరిచయం చేశారు. ఆ టీజర్‌లో సినిమాలో ఆమె లుక్‌ ఎలా ఉండబోతుందో కూడా రివీల్ చేశారు. కానీ అంతకు మించి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వలేదు. అయితే ఈ రేంజ్‌ సినిమాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా… ఏదో ఒకరకంగా సినిమా లొకేషన్‌ పిక్స్‌ బయటకు వచ్చేస్తుంటాయి. ఎంతో స్ట్రిక్ట్‌గా ఉండే రాజమౌళి, సందీప్‌ రెడ్డి వంగా లాంటి వాళ్లకు కూడా ఈ సమస్య తప్పలేదు. కానీ ఈ విషయంలో అట్లీ మాత్రం లీకు వీరులకు దొరక్కుండా బన్నీ లుక్‌ను దాచి పెడుతున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ అంతా ముంబై స్టూడియోలో చేస్తుండటం, సెట్‌లో క్రూకి స్ట్రిక్ట్ రూల్స్‌ పెట్టడం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే అప్‌ కమింగ్ సినిమాల మేకర్స్‌ కూడా అట్లీ స్టైల్‌ను ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

BIKER Trailer : బైకర్‌ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్‌

స్పీడ్ పెంచుతున్న యంగ్ హీరోలు.. ఒకేసారి రెండు మూడు కథలు లైన్‌లో పెడుతున్నారు

Pawan Kalyan: స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. ఈసారి దబిడి దిబిడే..

సవాళ్లకు సై అంటున్న హీరోయిన్లు.. నిర్మాతలుగా ప్రూవ్ చేసుకుంటున్న ముద్దుగుమ్మలు

Published on: Mar 23, 2026 06:09 PM
Follow Us