పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్.. ఎందుకు ఆగుతున్నట్టు ??
దురంధర్ 2 బ్లాక్ బస్టర్ విజయం తర్వాత, బాహుబలి 3, KGF 3, పుష్ప 3 వంటి పాన్-ఇండియా సినిమాల తదుపరి భాగాల కోసం అభిమానుల ఆసక్తి పెరిగింది. అయితే పార్ట్ 3 సినిమాల నిర్మాణంలో తీవ్ర జాప్యం కనిపిస్తుంది. భారీ అంచనాలను అందుకోవడం, కథ, నటీనటుల డేట్లు, బడ్జెట్ వంటి సవాళ్లు దీనికి ప్రధాన కారణం. పూర్తిగా నిరాకరించకపోయినా, అన్ని అంశాలు కుదిరితేనే నిర్మాతలు పార్ట్ 3 పై ముందుకు వెళ్లాలని చూస్తున్నారు.
ధురంధర్ 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో పార్ట్ 3 గురించి డిస్కషన్ మొదలైంది. ఇదే సిరీస్‌లో మరో మూవీ ఉంటుందన్న న్యూస్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అంతేకాదు గతంలోనూ ఇలా సూపర్ హిట్ అయిన సినిమాలకు పార్ట్ 3 కావాలన్న డిమాండ్స్ పెండింగ్‌లో ఉన్నాయి. అసలు పార్ట్ 3 విషయంలో ఆలస్యానికి కారణం ఏంటి..? ఈ విషయంలో మేకర్స్ స్ట్రాటజీ ఏంటి? ఇండియన్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ నెంబర్స్‌ను రికార్డ్ చేసిన సినిమాలు బాహుబలి 2, కేజీఎఫ్ 2, పుష్ప 2. అందుకే ఈ సినిమాలకు కొనసాగింపు కావాలన్న డిమాండ్స్ చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం త్రీక్వెల్స్ విషయంలో ఫ్యాన్స్‌కు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వటం లేదు. అలా అని పార్ట్ 3 ఉండదని కూడా తేల్చేయటం లేదు. బాహుబలి 3 గురించి పెద్దగా డిస్కషన్ లేకపోయినా.. కేజీఎఫ్ 3, పుష్ప 3 పక్కాగా ఉంటాయని మేకర్స్ కన్ఫార్మ్ చేశారు. కానీ ఆ సినిమాల స్క్రిప్ట్స్ సంగతేంటి? ఎప్పుడు సెట్స్ మీదకు వెళతాయన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు. అయితే పార్ట్ 3 చేయటంలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే తొలి భాగన్ని మించి సీక్వెల్స్ సక్సెస్ సాధించటంతో పార్ట్ 3 మీద అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఆ రేంజ్ అంచనాలను అందుకోవటం అంటే మామూలు విషయం కాదు. ఆ స్థాయిలో కథ సెట్ అవ్వాలి. అదే స్థాయిలో కాస్టింగ్ కుదరాలి, అంతకు మించి మళ్లీ హీరోల డేట్స్ సెట్ అవ్వాలి. ఇవ్వన్ని సెట్ అవ్వటం అంత ఈజీగా అయ్యే పని కాదు. ఇన్ని ఈక్వెషన్స్ సెట్ చేయటం అంత ఈజీగా కాదన్న ఉద్దేశంతోనే పార్ట్ 3 విషయంలో మేకర్స్ ఆలోచనలో పడ్డారు. అభిమానుల డిమాండ్‌ను పూర్తిగా పక్కన పెట్టేయకపోయినా.. అన్ని కరెక్ట్‌గా కుదిరితేనే పార్ట్ 3ని పట్టాలెక్కించాలని చూస్తు్న్నారు. అందుకే ఈ క్రేజీ త్రీక్వెల్స్ అన్ని ఇంకా డిస్కషన్ స్టేజ్‌లోనే కనిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం
BIKER Trailer : బైకర్ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్
స్పీడ్ పెంచుతున్న యంగ్ హీరోలు.. ఒకేసారి రెండు మూడు కథలు లైన్‌లో పెడుతున్నారు
Pawan Kalyan: స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. ఈసారి దబిడి దిబిడే..
సవాళ్లకు సై అంటున్న హీరోయిన్లు.. నిర్మాతలుగా ప్రూవ్ చేసుకుంటున్న ముద్దుగుమ్మలు
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

