AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026లో అందాల భామల ఆశలు నెరవేరేనా ??

2026లో అందాల భామల ఆశలు నెరవేరేనా ??

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 23, 2026 | 8:05 PM

Share

బాలీవుడ్, టాలీవుడ్‌లోని పలువురు హీరోయిన్లు 2024/2026లో రాబోయే తమ సినిమాలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. జాన్వీ కపూర్ (పెద్ది), కియారా అద్వానీ (టాక్సిక్), మృణాల్ ఠాకూర్ (డెకాయిట్), దీపికా పదుకోణ్ వంటి తారలు తమ కెరీర్‌లో కీలకమైన విజయాల కోసం, ఘనమైన కమ్‌బ్యాక్‌ల కోసం ఈ చిత్రాలపైనే ఆధారపడుతున్నారు. ఈ సినిమాలు వారికి గేమ్-ఛేంజర్‌గా మారతాయని గట్టి నమ్మకంతో ఉన్నారు.

2026 లో మీరు దేని కోసం వెయిట్‌ చేస్తున్నారు అని అడిగితే.. ఒక్కొక్కరూ ఒక్కో విషయాన్ని షేర్‌ చేసుకుంటారేమో. కానీ కొందరు బాలీవుడ్‌ హీరోయిన్లు మాత్రం పెక్యులియర్‌గా ఒకే విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. ఇంతకీ వారు చెబుతున్న వివరాలేంటి? వాటికున్న ఇంపార్టెన్స్ ఏంటి? చూసేద్దాం వచ్చేయండి.. అప్పుడెప్పుడో దేవర సినిమా చేసిన తర్వాత సరైన సక్సెస్‌ లేదు శ్రీదేవి తనయ జాన్వీ ఖాతాలో. అందుకే ఈ ఏడాది రిలీజ్‌కి రెడీ అవుతున్న పెద్ది మీద బిగ్‌ హోప్స్ పెట్టకున్నారు ఈ లేడీ. లాస్ట్ ఇయర్‌ రామ్‌చరణ్‌ తో తెలుగువారిని పలకరించారు కియారా. ఆమె సినీ కెరీర్‌కి గేమ్‌ ఛేంజర్‌ పెద్దగా ప్లస్‌ కాలేదు. అందుకే ఈ ఏడాది రిలీజ్‌కి రెడీ అవుతున్న టాక్సిక్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య ప్రెగ్నెన్సీ బ్రేక్‌ తీసుకున్న కియారాకి టాక్సిక్‌ చాలా కీలకమైన మూవీ. మన దగ్గర మృణాల్‌ కూడా ఈ ఏడాది మీద మరిన్ని ఆశలు పెంచుకున్నారు. అడివి శేష్‌ తో కలిసి ఆమె నటించిన డెకాయిట్‌ త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఎలాగైనా ఈ సినిమా సక్సెస్‌ చూడాలన్నది మృణాల్‌ కోరిక. ఇటీవలి కాలంలో పెళ్లి వార్తలతో వైరల్‌ అవుతున్న మృణాల్‌.,. ఎవరరేమనుకుంటే నాకేంటి? నా దృష్టి మొత్తం డెకాయిట్‌ మీదే ఉందంటున్నారు. మన వాళ్లే కాదు.. నార్త్ బ్యూటీ ఆలియా, శార్వరి వాఘ్‌ కూడా ఈ ఏడాది మీద గట్టిగానే నమ్మకం పెంచుకుంటున్నారు. ఎన్నాళ్లుగానో వెయిట్‌ చేస్తున్న విజయం ఈ ఏడాది ఆల్ఫాతో అందుతుందన్నది ఆలియా అండ్‌ శార్వరి ఆశ. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో మరోసారి ఫేమస్‌ కావాలంటే ఆల్ఫా సక్సెస్‌ కంపల్సరీ అన్నది వారిద్దరూ చెబుతున్న మాట. దీపిక పదుకోన్‌ కూడా సాలిడ్‌ కమ్‌ బ్యాక్‌ సక్సెస్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. నార్త్ లో షారుఖ్‌ తో కింగ్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ, తెలుగులో ఐకాన్‌స్టార్‌తో మూవీ చేస్తున్నారు. ఇటు కృతిసనన్‌ కూడా కాక్‌టైల్‌ సీక్వెల్‌తో ఆశించిన సక్సెస్‌ వస్తుందని నమ్మకంతో ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆల్ రౌండర్స్ అయిపోతున్న హీరోయిన్లు.. సినిమాల్లో సత్తా చాటుతున్న బ్యూటీస్

హిట్టు కొట్టు గురూ.. లేకపోతే అంతే సంగతులు.. కుర్ర హీరోలకు అల్టిమేటం

పాన్ ఇండియన్ సినిమాలకు సౌత్ బ్యూటీస్ పనికిరారా..?

యంగ్ హీరోలకు అసలైన అగ్నిపరీక్ష

పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??

Follow Us