Dhurandhar 2: బెస్ట్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్2
ఈ సమ్మర్‌లో టాలీవుడ్ సినిమా రిలీజ్‌ల మధ్య భీకర పోటీ నెలకొంది. ధురందర్ 2 ముందుగానే విడుదలైంది. టాక్సిక్ పలు కారణాలతో వాయిదా పడింది. పెద్ది రిలీజ్ గురించి రూమర్స్ ఉన్నా, మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ విశ్వంభర ఈ సమ్మర్‌కు వస్తుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం మీద ప్రేక్షకులు అనేక అప్‌డేట్‌లను ఎదురుచూస్తున్నారు.
సమ్మర్… సమ్మర్.. సమ్మర్.. ఈ సమ్మర్ స్టార్టింగ్‌లోనే మూడు సినిమాల మధ్య భీభత్సమైన పోటీ ఉంటుందనేది మొన్న మొన్నటిదాకా విన్న మాట. అంతగా డిస్కషన్‌కి రీజన్ అయిన ఆ సినిమాల రిలీజ్ డేట్ రానే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? చూసేద్దాం పదండి. ధురంధర్ ఫస్ట్ పార్టుకి మంచి టాక్ రావడం, టీజర్‌తోనే ధురంధర్ సెకండ్ పార్ట్ మీద భీభత్సమైన హైప్ క్రియేట్ కావడంతో మార్చి 19 ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లిక్ కావడం ఖాయమని అనుకున్నారంతా. అనుకున్నట్టుగానే మార్చి 19కన్నా ఒక రోజు ముందే ప్రీమియర్స్ తో ఢంకా భజాయించింది ధురంధర్ సీక్వెల్. మన దగ్గర ఉస్తాద్ భగత్‌సింగ్ చెప్పిన టైమ్ కి రిలీజ్ అయింది. పలు ప్రాంతాల్లో యుద్ధ ప్రభావం విపరీతంగా ఉందనే విషయాన్ని కారణంగా చూపిస్తూ టాక్సిక్ మూవీ వాయిదాను ప్రకటించింది. అయితే ప్రాడక్ట్ ఇంకా రెడీ కాలేదని, గ్రాఫిక్స్ తో యష్ శాటిస్‌ఫై కాలేదని, అందుకే సినిమాను వాయిదా వేశారనే టాక్ కూడా గట్టిగానే నడిచింది. టాక్సిక్ వాయిదా పడ్డట్టుగానే పెద్ది కూడా వాయిందా పడుతుందా? ఏప్రిల్ ఎండింగ్ నుంచి మరోసారి వాయిదాను తీసుకుంటుందా? అనే ప్రచారం తీవ్రంగా నడిచింది. అయితే అలాంటిదేమీ లేదంటున్నారు మేకర్స్. ఒక్క స్పెషల్ సాంగ్, నాలుగు రోజుల స్పోర్ట్స్ తాలూకా షూట్ పెండింగ్ ఉందని, అది కూడా వీలైనంత త్వరగా పూర్తవుతుందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని క్లారిటీ ఇస్తున్నారు. మేకర్స్ చెప్పినట్టు పెద్ది అనుకున్న టైమ్‌కి ల్యాండ్ అయినా, విశ్వంభర పరిస్థితి ఏంటని ఆరా తీస్తున్నారు అభిమానులు. ఈ సమ్మర్‌కి విశ్వంభర రావడం పక్కా అని మెగాస్టార్ స్వయంగా ఇచ్చిన మాటను, నిలబెట్టే ప్రయత్నంలోనే యూనిట్ ఉందా? అనే డిస్కషన్ షురూ అయింది. పనిలో పనిగా సమ్మర్ రిలీజ్ అయ్యే మిగిలిన సినిమాల మీద ఓ లుక్ వేసేస్తు్న్నారు జనాలు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పదేళ్ల ప్రస్థానం గురించి మాట్లాడిన భూమి ఫడ్నేకర్
2026లో అందాల భామల ఆశలు నెరవేరేనా ??
ఆల్ రౌండర్స్ అయిపోతున్న హీరోయిన్లు.. సినిమాల్లో సత్తా చాటుతున్న బ్యూటీస్
హిట్టు కొట్టు గురూ.. లేకపోతే అంతే సంగతులు.. కుర్ర హీరోలకు అల్టిమేటం
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

