AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: పక్కా హిట్ కోసం భాయిజాన్ వెయిటింగ్

Salman Khan: పక్కా హిట్ కోసం భాయిజాన్ వెయిటింగ్

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 23, 2026 | 8:21 PM

Share

ఈద్‌కు సల్మాన్ ఖాన్ సినిమా విడుదల ఆలస్యం కానుంది. 'మాతృభూమి' (గతంలో 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్')గా పేరు మార్చుకున్న ఈ చిత్రం గల్వాన్ దాడులపై ఆధారపడి ఉంది. ఇండో-చైనా సంబంధాలు చిత్రీకరించినప్పటికీ, వివాదాలను నివారించడానికి సల్మాన్ కథలో చైనాకు వ్యతిరేకంగా ఉన్న సన్నివేశాల గాఢతను తగ్గించాలని సూచించారు. అభిమానులు భారీ హిట్ ఆశిస్తున్నారు.

ఈద్‌కి సినిమా రావడం పక్కా అని అనౌన్స్ చేసే సల్మాన్‌ఖాన్‌ ఈ సారి కాస్త ఆలస్యంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జర్రింత ఆలస్యం చేస్తే చేశారుగానీ, ఎలాగైనా ఈ సారి హిట్‌ బొమ్మను పట్టుకొచ్చేయండి అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు ఆయన అభిమానులు. ఇంతకీ సల్లూభాయ్‌ ఏం చేస్తున్నారు? సినిమా సక్సెస్‌ కావాలంటే జస్ట్ కంటెంట్‌ ఉంటే సరిపోదు, కలరింగ్‌ కూడా ఉండాలని ఇప్పుడు కాస్త గట్టిగానే నమ్ముతున్నారు సల్మాన్‌ఖాన్‌. అందుకే లేటెస్ట్ సినిమాకు మాతృభూమి అని టైటిల్‌ కూడా పెట్టేశారు. మే వార్‌ రెస్ట్ ఇన్‌ పీస్‌ అంటూ ట్యాగ్‌ లైన్‌ కూడా ఇచ్చేశారు. గల్వాన్‌ దాడులను అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించింది టీమ్‌. ఆల్రెడీ రిలీజ్‌ అయిన ప్రమోషనల్‌ కంటెంట్‌లోనూ ఆ విషయం స్పష్టంగా కనిపించింది. ఇండో చైనా మధ్య సంబంధాలను పోట్రే చేసే సన్నివేశాలు చాలానే ఉండనున్నాయి ఈ చిత్రంలో. రీసెంట్‌గా టైటిల్ విషయంలో మార్పులు చేసిన సల్మాన్‌, ఇప్పుడు మూవీ కంటెంట్ విషయంలోనూ జాగ్రత్త పడుతున్నారట. బ్యాటిల్ ఆఫ్‌ గల్వాన్ టైటిల్‌ను మాతృభూమిగా మార్చిన భాయ్‌జాన్‌, కథలోనూ చైనాకు వ్యతిరేకంగా ఉన్న సన్నివేశాల గాఢతను తగ్గించాలని సూచించారట. ఎడిటింగ్‌లో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. రిలీజ్‌కు ఎలాంటి సమస్యలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: చలాకీగా సందడి చేస్తున్న రష్మిక మందన్న

Dhurandhar 2: బెస్ట్ టాక్‌ తో దూసుకుపోతున్న ధురంధర్2

పదేళ్ల ప్రస్థానం గురించి మాట్లాడిన భూమి ఫడ్నేకర్

2026లో అందాల భామల ఆశలు నెరవేరేనా ??

ఆల్ రౌండర్స్ అయిపోతున్న హీరోయిన్లు.. సినిమాల్లో సత్తా చాటుతున్న బ్యూటీస్

Follow Us