Stock Market: యుద్ధం దెబ్బకి కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ కీలక స్థాయిలను కోల్పోయాయి. ముడి చమురు ధరల పెరుగుదల ఆందోళన, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి విలువ క్షీణత దీనికి ప్రధాన కారణాలు. మదుపరుల సంపద కోల్పోగా, మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొంటేనే మార్కెట్లు కోలుకుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత తీవ్రం కావడంతో దాని ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లను కల్లోలంలోకి నెట్టేశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు మార్చి 23 సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ముడి చమురు ధరలు పెరుగుతాయన్న ఆందోళనలతో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు కుప్పకూలాయి. సోమవారం ఉదయం 9:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 1855 పాయింట్లు దిగజారి 72,677 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కీలకమైన 23 వేల మార్కును కోల్పోయి, 591 పాయింట్ల నష్టంతో 22,522 వద్ద ట్రేడ్ అవుతోంది. సోమవారం ఒక్క సెషన్‌లోనే మదుపర్ల సంపద సుమారు రూ. 11 లక్షల కోట్లు హరించుకుపోయింది. దేశీయ కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేనంతగా క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే ఈ రోజు 33 పైసలు తగ్గి 93.86 వద్ద సరికొత్త కనిష్ఠాన్ని తాకింది. ఇది దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వేగంగా ఉపసంహరించుకుంటున్నారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 20 వరకు కేవలం 16 రోజుల్లోనే రూ. 1 లక్ష కోట్లు వెనక్కి తీసుకున్నారు. అంటే సగటున ఒక ట్రేడింగ్ అవర్‌కు రూ. 1000 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయి. మరోవైపు ముడిచమురు ధరలు భయపెడుతున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగితే ఏప్రిల్ నాటికి బ్యారెల్ చమురు ధర 180 డాలర్లను దాటవచ్చని సౌదీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ 113 డాలర్ల వద్ద ఉంది. ఇటు హర్మూజ్ జలసంధిని మూసివేస్తామన్న ఇరాన్ హెచ్చరికలు ప్రపంచ రవాణా వ్యవస్థను ఆందోళనలో పడేశాయి. దీనివల్ల ముడి పదార్థాల కొరత ఏర్పడి, రవాణా ఆలస్యమయ్యే ప్రమాదం లేకపోలేదు. భారత మార్కెట్లే కాకుండా ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప మార్కెట్లు కోలుకునే సూచనలు కనిపించడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా తగ్గుతున్న బంగారం ధర
Rashmika Mandanna: చలాకీగా సందడి చేస్తున్న రష్మిక మందన్న
Dhurandhar 2: బెస్ట్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్2
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

