పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఓ విద్యార్థి తన గురువుకు రాసిన వినూత్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురువే దైవం, మీరే నాకు అమ్మానాన్న, దయచేసి పాస్ చేయండి అంటూ రాసిన ఆ లేఖ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చదివిన ప్రశ్నలు రాలేదని పేర్కొంటూ, గురువు కాళ్లు పట్టుకుంటున్న బొమ్మ కూడా గీశాడు.