AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Chandrababu: రాష్ట్రంలోని యువతకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలోనే లక్ష ఉద్యోగాలు!

అనకాపల్లిలో జరిగిన శంకుస్థాపన స్టీల్ ప్లాంట్‌కు మాత్రమే కాదని... స్టీల్ సిటీ నిర్మాణం కోసమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీకి రావడం చాలా మంచి పరిణామమని.. అనకాపల్లి, ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు రాష్ట్రం ప్రగతి వైపు పరుగులు పెట్టడానికి ఈ స్టీల్ ప్లాంట్ ఉపకరిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు అనే నేను చెబుతున్నా... పరిశ్రమలకు ఏపీనే బెస్ట్ ప్లేస్ అంటూ సీఎం ప్రకటించారు.

CM Chandrababu: రాష్ట్రంలోని యువతకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలోనే లక్ష ఉద్యోగాలు!
Anakapalle Steel Plant Cm Chandrababu Inaugurates Arcelormittal Nippon Steel Project
Anand T
|

Updated on: Mar 24, 2026 | 8:46 AM

Share

సోమవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుపస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 20 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటును శంకుస్థాపన చేసుకున్నారు. ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షమంది యువతకు ఉద్యోగాలు వస్తాయని.. ఈ ప్రాజెక్టు రావడానికి కృషి చేసిన ఆదిత్య మిట్టల్, మంత్రి నారా లోకేష్‌ను అభినందిస్తున్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం భూమిని ఇచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

రెండు దశల్లో నిర్మితమయ్యే ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుందని. రూ.1.35 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ సంస్థకు జాతీయ స్థాయిలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంచి పేరుందన్నారు. ఇలాంటి సంస్థ ఏపీకి రావడం చాలా మంచి పరిణామని అందుకే చెబుతున్నానన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు కూడా నిర్మాణం జరుగుతుందని.. 2028 నాటికి ప్లాంట్‌లో మొదటి దశ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ రూపొందించారన్నారు.

2030 జూన్ నాటికి మొదటి బ్లాస్టర్ ఫర్సెన్, డిసెంబరు నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నెస్ నిర్మాణం పూర్తి చేస్తారమన్నారు. అలాగే జాతీయ రహదారిని అనుసంధానిస్తూ 4 లేన్ల రహదారి కూడా పూర్తి అవుతుందన్నారు. పరిశ్రమకు ముడి ఇనుము సరఫరా కోసం పైప్ లైన్ కూడా వేయబోతున్నారు. ఈ ప్లాంట్ కోసం పైప్ లైన్ వేయాలని ప్రధానిని కోరితే వెంటనే అంగీకరించారు. ఉక్కు ఉత్పత్తి ఒక్కటే కాదు ఆర్ధిక లావాదేవీలతో విద్య, వైద్యం, ఉద్యోగాలతో ఈ ప్రాంత రూపు రేఖలు మారతాయని సీఎం చంద్రబాబు తెలిపారు.

అనుమతులు వేగంగా ఇస్తాం.. అదే వేగంతో అభివృద్ధి చేయండి

ఈ పరిశ్రమకు ఇంత వేగంగా భూసేకరణ, అనుమతులను ఒక్క ఏపీలోనే ఇచ్చాం. దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ అని.. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం, రాష్ట్రం ఉంది. నిపుణులు, మానవ వనరులు ఏపీకి మాత్రమే సొంతం అన్నారు. టూరిజం నుంచి డేటా సెంటర్ వరకూ, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి తయారీ రంగం వరకూ అన్నింటికీ ఏపీలో మెండైన అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆలోచనలతో వచ్చి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే నినాదాన్ని విజయవంతం చేస్తామన్నారు.

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. 15 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావటం దేశంలో ఇదే తొలిసారి అన్నారు. బీపీసీఎల్ సహా పెద్ద పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల్లోనే రాష్ట్రానికి 20.35 లక్షల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ నాలెడ్జి ఎకానమీ, పోర్టులు, స్టీల్, డేటా సెంటర్లు, ఐటీ సెంటర్లు ఇలా కీలకమైన కేంద్రంగా విశాఖ మారుతోందన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్, రిలయన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడి పెడుతున్నాయని.. రేర్ ఎర్త్ మినరల్ హబ్‌గా ఉత్తరాంధ్ర మారుతుందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నీటిని పోలవరం ద్వారా అందిస్తామన్నారు.

కొత్తగా పోర్టులు, ఎయిర్ పోర్టులు వస్తున్నాయని.. ఉత్తరాంధ్రలో మూలపేట పోర్టు, జూలైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభిస్తామన్నారు. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి వేగంగా నిర్మాణం పూర్తి చేసుకునేందుకు సహకారం ఇస్తామన్నారు. ఈ పరిశ్రమ నిర్మాణంలో రైతులు తమ భూములను త్యాగం చేశారు. వారికి సహకారం అందించాలన్నారు. ఉక్కు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మొదటిగా అనకాపల్లి జిల్లా యువతకు ఈ పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఆవిష్కరణల కోసం మెటలర్జీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తున్నందుకు అభినందనలు అని తెలిపారు.

కేంద్ర సహకారంతోనే సాధ్యం

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లే ఈ ప్రాజెక్టు సాకారమైంది. రాష్ట్రంపై ప్రధాని చూపిస్తున్న అభిమానానికి ఈ వేదిక పైనుంచి మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు. ప్రధాని మోదీ చెప్పిన Chip to Ship తయారీ విధానానికి ఏపీ తిరుగులేని వేదిక అన్నారు. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో నేడు ఈ పరిశ్రమ రాష్ట్రానికి వచ్చిందన్నారు. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ విజయం అని సీఎం తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us