పెద్దపల్లి జిల్లా మోట్లపల్లిలో పూజల పేరుతో గోనె లక్ష్మి, రాజారాం దంపతులు ఘోరమైన మోసానికి గురయ్యారు. ఇంట్లోని చెడు పోగొడతానని చెప్పి, ఓ కంత్రీ మంత్రగాడిని పిలిపించి పావు తులం చెవి కమ్మలు, తులం చైను, రూ. 80 వేల నగదును అపహరించాడు. బాధితులు మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు.