PM Modi: టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..
టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన కీలక ప్రసంగంతో సదస్సును ప్రారంభించగా.. దేశం నలుమూలల నుంచి సీఎంలు, కేంద్ర మంత్రులు, క్రీడాకారులు ఒక్క వేదికపై చేరారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.
టీవీ9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే – 2026 సదస్సు ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమైంది. “ఇండియా అండ్ ది వరల్డ్” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ నాలుగో ఎడిషన్ సదస్సుకు దేశ విదేశాల నుంచి దిగ్గజాలు తరలివచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. గతేడాది ఇదే వేదికపై టీవీ9 నెట్‌వర్క్‌ను ప్రశంసించిన ప్రధాని.. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో టీవీ9 వంటి మాధ్యమాలు పోషిస్తున్న పాత్రను కొనియాడారు. భారత్ నేడు ప్రపంచ గమనాన్ని నిర్దేశించే స్థితిలో ఉందని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
రెండు రోజుల పాటు మేధోమథనం
మార్చి 23, 24 తేదీలలో జరిగే ఈ సదస్సులో మొత్తం ఏడు ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఆర్థిక వృద్ధి, సుపరిపాలన, సాంకేతిక ఆవిష్కరణలు, సస్టైనబిలిటీ, సంస్కృతి వంటి అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. రేపు జరిగే సత్తా సమ్మేళనం రాజకీయ పరిణామాలపై చర్చకు కేంద్రబిందువు కానుంది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, అఖిలేష్ యాదవ్, స్మృతి ఇరానీ, అసదుద్దీన్ ఒవైసీ, డీకే శివకుమార్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

