Allu Arjun: ఇదీ క్రేజ్ అంటే !! ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ బన్నీకి
ఏయ్ బిడ్డా... ఇది నా అడ్డా అని ఈ సారి రికార్డుల సాక్ష్యంగా చెప్పేస్తున్నారు అల్లు అర్జున్. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ 2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్ టెన్ ఆర్టిస్టుల లిస్టు రిలీజ్ చేసింది. ఇందులో 300 కోట్ల రూపాయలు అందుకుంటున్న స్టార్‌గా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు ఐకాన్‌స్టార్.
Updated on: Nov 29, 2024 | 9:30 PM

ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలోనూ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు అల్లు అర్జున్ అండ్ పుష్ప 2 టీం. హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ బన్నీకి బాగా కలిసొచ్చిన వేదిక.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా చోట్ల ఈవెంట్స్ చేసిన పుష్ప 2 టీం.. తాజాగా తెలుగులో ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే డిసెంబర్ 2న ఈ వేడుక జరగనుంది.

గతంలో అల వైకుంఠపురములోతో పాటు పుష్ప ఈవెంట్స్ ఇక్కడే జరిగాయి. అందులో ఒకటి ఇండస్ట్రీ హిట్ కాగా.. మరో సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయ్యారు అల్లు అర్జున్.

అల్లు వారబ్బాయికి అంత బాగా కలిసొచ్చిన చోటే పుష్ప 2 ఈవెంట్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ భారీ స్థాయిలో జరగనుంది. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై ఈవెంట్స్ సూపర్ హిట్ అయ్యాయి.

ఎవరిని కదిపినా దీని గురించే చర్చ జరుగుతుంది. మరో రెండు మూడు రోజుల్లోనే సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో మరింత జోరు పెంచారు మేకర్స్.




