- Telugu News Photo Gallery Cinema photos Hero Suriya starts a new movie shooting with Director RJ Balaji is Suriya 45 and His Upcoming Movie Updates
Suriya 45: ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ కొత్తసినిమాను స్టార్ట్ చేసిన సూర్య.!
సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. భారీ ఆశలు పెట్టుకున్న కంగువా నిరాశపరచటంతో సూర్య బ్రేక్ తీసుకుంటారని ఎక్స్‌పెక్ట్ చేశారు ఇండస్ట్రీ జనాలు. కానీ సూర్య మాత్రం ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా కొత్త సినిమాను పట్టాలెక్కించారు. సూర్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కంగువా. శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేశారు.
Updated on: Nov 29, 2024 | 9:21 PM

సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. భారీ ఆశలు పెట్టుకున్న కంగువా నిరాశపరచటంతో సూర్య బ్రేక్ తీసుకుంటారని ఎక్స్‌పెక్ట్ చేశారు ఇండస్ట్రీ జనాలు.

కానీ సూర్య మాత్రం ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా కొత్త సినిమాను పట్టాలెక్కించారు. సూర్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కంగువా.

శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్న నడిప్పిన్ నాయగన్, దేశమంత తిరిగి సినిమాను ప్రమోట్ చేశారు.

ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ అలాంటిది. కానీ, తీరా విడుదలయ్యాక జనాలను అట్రాక్ట్ చేయలేకపోయింది. అయినా డీలా పడిపోలేదు సూర్య.

రెండు వేల కోట్ల టార్గెట్‌తో బరిలో దిగిన కంగువా 200 కోట్ల మార్క్ కూడా చేరుకోలేకపోయింది. కంగువా నిరాశపరచటంతో సూర్య కొద్ది రోజులు ఆడియన్స్ ముందుకు రారేమో అనుకున్నారు ఆడియన్స్.

కానీ సూర్య ఫెయిల్యూర్‌ను పక్కన పెట్టేసి నెక్ట్స్ సినిమా వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తయ్యింది.

వెర్సటైల్ ఆర్టిస్ట్ గా పేరున్న సూర్య.. జస్ట్ మాస్.. నథింగ్ ఎల్స్ అనడానికి రీజన్ ఏంటి.? ప్యాన్ ఇండియా కాదు, వరల్డ్ వైడ్ దద్దరిల్లిపోయే సినిమా అంటూ కంగువను ప్రమోట్ చేశారు నడిప్పిన్ నాయగన్ సూర్య.

కార్తిక్ సుబ్బరాయన్ దర్శకత్వంలో తెరకెక్కింది రెట్రో. చాన్నాళ్ల తర్వాత పూజా హెగ్డేకి ప్రామినెంట్ రోల్ కనిపిస్తోంది ఈ మూవీలో. సూర్య గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నారు.




