- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan will complete the shooting of Harihara Veeramallu before Sankranthi, Details Here
Pawan Kalyan: ఎప్పుడు.? ఇంకెప్పుడు.? అభిమానుకు గుడ్ న్యూస్ ఇచ్చిన పవర్ స్టార్.!
ఎప్పుడు.? ఇంకెప్పుడు.? అని అందరూ ఇష్టంగా ఆరా తీసిన తరుణం రానే వచ్చింది. వీరమల్లు కేరక్టర్ కోసం మేకప్ వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. కదలిక అంటూ మొదలైతే.. వీరమల్లు తర్వాత క్యూలో ముందుకు జరిగే మూవీ ఓజీ యేగా.. అని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా హరిహరవీరమల్లు. ఇంకొన్నాళ్ల షూటింగ్ మినహా సింహభాగం చిత్రీకరణ పూర్తయింది.
Updated on: Nov 29, 2024 | 8:59 PM

చెప్పినట్టు సమ్మర్‌కి హరిహరవీరమల్లుతో వచ్చేయాలని ఫిక్సయ్యారు పవన్. 80, 90ల్లో జరిగే పీరియాడిక్ కథతో ప్యాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నారు పవర్‌స్టార్. ఈ సినిమా ఇచ్చే రిజల్టును బట్టి, ఓజీని డిజైన్ చేయాలని ఫిక్సయ్యారు సుజీత్.

కదలిక అంటూ మొదలైతే.. వీరమల్లు తర్వాత క్యూలో ముందుకు జరిగే మూవీ ఓజీ యేగా.. అని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా హరిహరవీరమల్లు.

ఇంకొన్నాళ్ల షూటింగ్ మినహా సింహభాగం చిత్రీకరణ పూర్తయింది. ఆ మిగిలిన షెడ్యూల్‌ని కూడా గురువారం నుంచి మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.

డిసెంబర్ 10వరకు జరిగే ఈ ఆఖరి షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని టాక్. హరిహర వీరమల్లు షూటింగ్ అయిపోయాక,

కాస్త గ్యాప్ తీసుకుని.. డిసెంబర్ ఎండింగ్‌కి ఓజీ సెట్స్ లోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు పవర్‌స్టార్. ఓజీ పరంగానూ భారీ షూటింగ్ ఏమీ బ్యాలన్స్ లేదు.

ఉన్న కీలకమైన సన్నివేశాలను సంక్రాంతి లోపు కంప్లీట్ చేసేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ మార్చిలో హరిహరవీరమల్లు డేట్ ఫిక్స్ అయింది.

దీన్ని బట్టి, ఆ తర్వాత ది బెస్ట్ సీజన్ ఏది అనిపిస్తే.. అక్కడ.. ఓజీ టీమ్ ఖర్చీఫ్ వేసేయడానికి ప్లాన్ చేస్తోంది.

అదే జరిగితే 2025లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల రిలీజులతో పండగ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు పవర్‌స్టార్ సైన్యం.




