డ్రాగన్ తర్వాత ఆ స్టార్ హీరో సినిమాలో  రుక్మిణి వసంత్..?

Rajeev 

23  march 2026

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారు మోగుతున్న పేరు రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

కన్నడలో వరుస సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. ఒక్క సినిమాతోనే తెలుగువారి హృదయాలు గెలుచుకుంది.

ఇటీవలే నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీతో తెలుగు తెరకు పరిచమయైంది. ఈ సినిమా సైలెంట్ గా వచ్చి వెళ్లిపోయింది.

ఈ సినిమాతో రుక్మిణికి అంతగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ లో నటిస్తుంది ఈ వయ్యారి భామ.

కేవలం తెలుగులోనే కాదు కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ సుందరాంగి. 

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిన్నదానికి తెలుగులో మరో క్రేజీ అవకాశం వచ్చిందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది తర్వాత సుకుమార్ తో చేయబోయే సినిమాలో రుక్మిణి ఛాన్స్ అందుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.