Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు తినడానికి తిండి లేక.. రోజూ న్యూడుల్స్ తిని రోజులు గడిపింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్

చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా వందలకోట్లు వెనకేసుకుంటున్నారు. సినిమాలకు కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటూ బాగానే సంపాదిస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తున్న విషయం తెలిసిందే.. భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్న నేపథ్యంలో హీరోయిన్స్ కు కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నారు నిర్మాతలు.

అప్పుడు తినడానికి తిండి లేక.. రోజూ న్యూడుల్స్ తిని రోజులు గడిపింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 12, 2025 | 3:01 PM

చాలా మంది అందాల భామలు ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా రాణించాలని కోటి ఆశలతో వస్తుంటారు. అవకాశాల కోసం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని హీరోయిన్స్ గా తమ ప్రతిభను చాటుతున్నారు. అయితే చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలను, సమస్యలను ఎదురుకొన్నారు. కొంతమంది హీరోయిన్స్ పలు ఇంటర్వ్యూల్లో తాము కెరీర్ బిగినింగ్ లో ఎదుర్కొన్న సమస్యలను, ఇబ్బందులను పంచుకున్నారు కూడా.. తాజాగా ఓ హీరోయిన్ కూడా తనకు కెరీర్ బిగినింగ్ స్ట్రగుల్స్ ను గుర్తు చేసుకుంది. మోడలింగ్ నుంచి నటిగా మారిన ఆమె ఆ సమయంలో చాలీచాలని డబ్బుతోనే జీవితాన్ని కొనసాగించా అని తెలిపింది. అంతే కాదు తినడానికి తిండి కూడా లేక న్యుడిల్స్ తిని రోజులు గడిపా అని తెలిపింది. ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఇవే కష్టాలను చూసిందని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :ఎన్టీఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా అదరగొట్టిందిగా..

బాలీవుడ్ లో ఎంతో మంది అందాల భామలు ఉన్నారు. వారిలో దియా మీర్జా ఒకరు. ఈ అమ్మడు మోడలింగ్ నుంచి నటిగా మారింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు తెలుగులోనూ ఈ అమ్మడు నటించింది. తన కెరీర్ లో పేరెంట్స్ సపోర్ట్ లేదు అని తెలిపింది. మిగతా హీరోయిన్స్ కు తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటుంది. కానీ తాను మోడలింగ్ చేస్తున్న సమయంలో తల్లి దండ్రులు సపోర్ట్ లేదు అని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఈమెను మించిన హాట్ బ్యూటీ ఉంటుందా..! చేసింది రెండు సినిమాలు.. ఒకొక్క మూవీకి అందుకుంటుంది రూ.3 కోట్లు

2000లో నేను, ప్రియాంకా చోప్రా, లారా దత్తా.. మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్నాం .. అయితే ఆ సమయంలో ప్రియాంక చోప్రాకు తన తల్లి సపోర్ట్ చేశారు. కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆ సమయంలో ముంబైలో లారా దత్తా  ఇరుకు ఇంట్లో ఉండేది. ఆ ఇంట్లోనే  నాకు ఉండేదుకు చోటు ఇచ్చింది. ఇద్దరం కలిసి అందులోనే సర్దుకునేవాళ్ళం.. ఫ్యాషన్ షోలో ఖరీదైన దుస్తులు వేసుకునేవాళ్ళం కానీ మా చేతిలో చిల్లు గవ్వ కూడా ఉండేది కాదు. తినడానికి తిండి కూడా ఉండేది కాదు . అప్పట్లో న్యుడిల్స్ తిని రోజులు గడిపాము అని తెలిపింది దియా మీర్జా . ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: ప్రేమించినవాడి కోసం మతం మార్చుకుంది.. పేరు మార్చుకుంది.. చివరకు ఇలా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!