AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరాచకంరా సామీ..! మరీ ఇంత బోల్డ్ సినిమానా..!! 3 ఓటీటీల్లో రచ్చ చేస్తున్న రొమాంటిక్ మూవీ

ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా చాలా జోనర్స్‌లో సినిమాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఓ రొమాంటిక్ సినిమా రచ్చ చేస్తుంది.

అరాచకంరా సామీ..! మరీ ఇంత బోల్డ్ సినిమానా..!! 3 ఓటీటీల్లో రచ్చ చేస్తున్న రొమాంటిక్ మూవీ
Ott Romantic Movie
Rajeev Rayala
|

Updated on: Mar 11, 2025 | 12:26 PM

Share

థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. వీకెండ్స్ లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు. ఇక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రకరకాల జోనర్స్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రొమాన్స్, థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ మూవీస్ కు ఓటీటీల్లో మంచి డిమాండ్ ఉంది. అలాంటి సినిమాలకే ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ఓటీటీ సంస్థలు కూడా అలాంటి సినిమాలనే ఎక్కువ అందుబాటులో ఉంచుతున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా రచ్చ లేపుతోంది. రొమాంటిక్ సినిమా అంటే అంతా ఇంతా కాదు.. బోల్డ్ సీన్స్ కు కొదవే లేదు.

ఈ రొమాంటిక్ సినిమా ఓ హిస్టారికల్ స్టోరీతో తెరకెక్కించారు. ఈ సినిమాలో భారత్, పాకిస్తాన్ మధ్య ఒక సరిహద్దు గీయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశిస్తుంది. అయితే ఆ సరిహద్దు ప్రాంతంలో ఓ బ్రోతల్ హౌస్ ఉంటుంది. దానిని ఖాళీ చేయాలని అక్కడ ఉన్నవారిని అధికారులు ఆదేశిస్తూ నోటీసులు ఇస్తారు. అయితే ఆ బ్రోతల్ హౌస్ ఓనర్ మాత్రం దానిని తిరస్కరిస్తుంది. ఆ ఇల్లు భవనాన్ని ఖాళీ చేయను అని తెగేసి చెప్తుంది.

అయితే ఆమె తన దగ్గర ఉన్న వేశ్యలను ఓ రాజు దగ్గరకు పంపుతూ ఉంటుంది. తన దగ్గరకు వచ్చిన వేశాలను మొదటిగా ఆ రాజు దగ్గరకే పంపుతుంది. అయితే ఆ భవనాన్ని కూల్చకుండా ఉండేలా చేయమని ఆ రాజునూ కోరుతుంది ఆ బ్రోతల్ హౌస్ ఓనర్. కానీ ఆ రాజు నేనేం చేయలేను అంటూ చేతులెత్తేస్తాడు. దాంతో ఆమె ఇది మీకు సరిహద్దు కావొచ్చు కానీ ఇది నా ఇల్లు ఇదే నా దేశం అంటూ తన దగ్గరున్న వేశ్యలతో కలిసి పోరాటానికి దిగుతుంది. ఆతర్వాత ఏం జరిగింది.? ఆమె పోరాటం ఫలించిందా.? అధికారులను ఆమె ఎలా ఎదుర్కొంది అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా పేరు రాజ్‌కహిని. బెంగాలీలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఐఎమ్‌డీబీ నుంచి 7.2 రేటింగ్ సాధించింది. ఇప్పుడు మూడు ఓటీటీల్లో అందుబాటులో ఉంది ఈ సినిమా. అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్), సన్ ఎన్‌ఎక్స్‌టీలో రాజ్‌కహిని ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us