ప్రేమించినవాడి కోసం మతం మార్చుకుంది.. పేరు మార్చుకుంది.. చివరకు ఇలా
సాధారణంగా చాలా మంది తారలు సినీరంగంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అనేక కష్టాలను, సవాళ్లను ఎదుర్కొని నటిగా ఫేమస్ అవుతారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్వయంకృషితో ఎదిగిన తారలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కు సంబంధించిన వార్తలు నిత్యం సినీ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూ ఉంటాయి.. ముఖ్యంగా హీరోయిన్స్ ఎఫైర్స్ గురించి ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఒకొక్కరు ఇద్దరు ముగ్గురితో ఎఫైర్స్ పెట్టుకున్నారు అంటూ ఏవేవో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అలాగే హీరోయిన్స్ పెళ్లి, విడాకులు గురించి కూడా వార్తలు వినిపిస్తుంటాయి. కొంతమంది హీరోయిన్ ప్రేమించిన వారి కోసం మతం కూడా మార్చుకున్న వారు ఉన్నారు. పెళ్లి తర్వాత వేరే మతంలోకి మారిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ప్రేమ కోసం ఈ చిన్నది ఏకంగా మాతం మార్చుకుంది. అలాగే పెళ్లి కోసం కెరీర్‌నే వదిలేసింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ లిప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొన్ని సినిమాలే చేసి ప్రేక్షకులను మెప్పించి ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అవుతున్నారు అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు. ఆమె పేరు దీపికా కకార్. సినిమాల్లోకి రాక ముందు ఈ చిన్నది ఎయిర్ హోస్టెస్‌గా చేసింది. ఆతర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఎయిర్ హోస్టెస్‌గా చేస్తున్న సమయంలో ఆరోగ్య సమస్యలు రావడంతో అది మానేసి.. సీరియల్స్ లోకి అడుగుపెట్టింది.
24 ఏళ్ల వయసులో ‘నీర్ భరే తేరే నైనా దేవి (2010)’ సీరియల్‌తో యాక్టింగ్ స్టార్ట్ చేసింది దీపికా. సీరియల్స్ లో దాదాపు ఆరేళ్ళ పాటు సీరియల్స్ లో నటించింది. అంతే కాదు ఆమె ఒకొక్క ఎపిసోడ్ కు రూ. 70వేలు తీసుకునేదట. దీపిక 2011లో రౌనక్ సామ్సన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఆతర్వాత సీరియల్స్ లో తనతో పాటు నటించిన కో స్టార్ షోయబ్ ఇబ్రహీంతో ప్రేమలో పడింది. పెళ్లి కోసం దీపిక ఇస్లాం మతంలోకి మారి ఫైజాగా పేరు మార్చుకుంది. ఆతర్వాత హిందీలో పలు టీవీ షోల్లోనూ పాల్గొంది ఈ అమ్మడు. అలాగే బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..