AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి సినిమా రా మావ.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు.. అలాగే అంతకు మించి..

ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు సందడి చేస్తున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఓటీటీలో ఇప్పటికే చాలా రకాలా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఇదెక్కడి సినిమా రా మావ.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు.. అలాగే అంతకు మించి..
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Mar 09, 2025 | 5:49 PM

Share

ఓటీటీలో ఎన్నో సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపే జోనర్స్ లో థ్రిల్లర్ మూవీస్ ఒకటి. కథలో ఇంట్రెస్ట్, సస్పెన్స్ లు, ట్విస్ట్ లు ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ట్విస్ట్ లతో ఆడియన్స్ మతిపోతుంది. ఈ సినిమా మలయాళంలో తెరకెక్కింది. ఈ మధ్యకాలంలో మలయాళ మూవీల హవా నడుస్తోంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్న సినిమాల్లో “చురులి” సినిమా ఒకటి.

ఇటీవలే చురులి సినిమా ఓటీటీలోకి వచ్చింది. చెంబన్ వినోద్ జోస్, వినయ్ ఫోర్ట్, జోజు జార్జ్, సౌబిన్ షాహిర్, జాఫర్ ఇడుక్కి, గీతి సంగీత ఈ సినిమాలో నటించారు. ఈ మూవీకి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో అందుబాటులో ఉంది. చురులి సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ సినిమా కథ ఏంటంటే..

జాయ్ (సౌబిన్ షాహిర్) అనే నేరస్థులను పట్టుకునేందుకు ఆంటోనీ (పోలీస్ ఆఫిసర్), షాజీవన్ (కానిస్టేబుల్) పేర్లు మార్చుకుని దట్టమైన అడవి మధ్యలో ఉండే చురులి అనే గ్రామంలోకి వెళ్తారు. ఇద్దరు అండర్ కవర్ పోలీసులుగా ఆ గ్రామంలోకి వెళ్తారు. చురులిలో తంకన్ (జోజు జార్జ్) అనే వ్యక్తి చెందిన రబ్బర్ తోటలో గుంతలు తవ్వడానికి వచ్చిన కూలీలుగా తమను పరిచయం చేసుకుంటారు. ఆ సమయంలో తంకన్ ఊరిలో లేకపోవడంతో ఆ ఇద్దరినీ ఓ కల్లు దుకాణం యజమాని (జాఫర్ ఇడుక్కి) పనిలో పెట్టుకుంటాడు. జాయ్‌ ఎవరో తెలుసుకుని పట్టుకునేందుకు కల్లు దుకాణంలో చేరుతారు ఆంటోనీ, షాజీవన్. చురులిలోకి అడుగుపెట్టిన ఆ పోలీసులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.? అక్కడున్న గ్రామస్థులు వింతగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు.? రాత్రి పడుకున్న తర్వాత షాజీవన్‌కు వచ్చే కలలు ఏంటి.? వాటి అర్థం ఏంటీ.? షాజీవన్‌కే ఎందుకు ఏలియన్స్ కనిపిస్తున్నాయి.? చివరకు జాయ్‌ను పోలీసులు పట్టుకున్నారా.? అసలు జాయ్ చేసిన నేరాలు ఏంటీ? అనేవి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. క్షణక్షణం ట్విస్ట్ లతో.. ఊహించని సంఘటనలతో సాగే ఈ సినిమా అదిరిపోయింది. ఈ మూవీని అసలు మిస్ అవ్వకండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.