ఎన్టీఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా అదరగొట్టిందిగా..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో సినిమా , బాలీవుడ్ మూవీ వార్ 2లతో బిజీగా ఉన్నారు తారక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి, ఆయా న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనలో ఎన్టీఆర్ ను బీట్ చేసే వారు లేరు. ఎలాంటి పాత్ర అయినా యిట్టె ఒదిగిపోయి నటిస్తారు తారక్. అలాగే ఎన్టీఆర్ డాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండియాలో ఉన్న బెస్ట్ డాన్సర్స్ లో తారక్ ఒకరు. ఇటీవలే ఎన్టీఆర్ దేవర సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. అంతకు ముందు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా తారక్ కు జపాన్ లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన దేవర సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించింది.
అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా చుట్టమల్లే సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరోసాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. అదే దావూది సాంగ్ . ఈ సాంగ్ లో తారక్ అదిరిపోయే స్టెప్పులతో మతిపోగొట్టారు. అయితే ఈ సాంగ్ ను కూడా చాలా మంది రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దావూది సాంగ్ కు తాజాగా జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా స్టెప్పులేసి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షి తెలుగు నక్షత్రం అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫరియా అబ్దుల్లా తన డాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. కాగా ఈ సాంగ్ కోసం ఫరియా అబ్దుల్లా ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
#fariaabdullah Vibing for #Daavudi 💥@tarak9999 #Devara
— NTR Fever ™ (@NTR_Fever) March 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.