Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా ఇది..! అపరిచితుడు బుడ్డోడు ఈ స్టార్ హీరో బామ్మర్ది అని మీకు తెలుసా.?

శంకర్ దర్శకత్వంలో విక్రమ్‌, సదా జంటగా నటించిన 'అపరిచితుడు' గురించి అందరికి తెలిసిందే. దీనిలో విక్రమ్ మూడు ఢిఫరెంట్‌ షేడ్స్‌లో అద్భుతంగా ఈ చిత్రంలో శంకర్‌ చూపించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా చూపించారు దర్శకుడు శంకర్.

ఇదేందయ్యా ఇది..! అపరిచితుడు బుడ్డోడు ఈ స్టార్ హీరో బామ్మర్ది అని మీకు తెలుసా.?
Aparichitudu
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 11, 2025 | 4:08 PM

టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమాలో విక్రమ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. మూడు వైవిధ్యమైన పాత్రల్లో అదరగొట్టాడు విక్రమ్. తమిళ్ లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో రాము, రెమో, అపరిచితుడు పాత్రల్లో నటించి మెప్పించాడు విక్రమ్. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే కదలకుండా చూస్తుంటారు ఆడియన్స్. ఇప్పటికీ మంచి టీఆర్ఫీతో సొంతం చేసుకుంటుంది అపరిచితుడు. సమాజంలో జరిగే తప్పులకు నరకంలో విధించే శిక్షలను అపరిచితుడు బ్రతికుండగానే విధిస్తుంటాడు. ఇక ఈ సినిమాలో విక్రమ్ చిన్ననాటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..?

అపరిచితుడు సినిమాలో విక్రమ్ చిన్ననాటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఓ స్టార్ హీరో బావమరిది. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు విరాజ్. అతని స్క్రీన్ నేమ్ హరి ప్రశాంత్. ఇప్పుడు ఈ చైల్డ్ యాక్టర్ హీరోగా మారడు.. ఇటీవలే ఓ సినిమాలో హీరోగా నటించాడు. హరి ప్రశాంత్ తండ్రి ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్.. అయన ఇళయ దళపతి తల్లికి సోదరుడు. ఇక విరాజ్ నాలుగు అయిదు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.

ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య మిషన్ చాఫ్టర్ 1 చిత్రంలో థామస్ పాత్రలో కనిపించాడు విరాజ్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అరుణ్ విజయ్ , అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో..

Aparichithudu

దళపతి విజయ్

View this post on Instagram

A post shared by Vijay (@actorvijay)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.