చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఇటీవలే రీరిలీజ్ అయిన ఈసినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమాతో మరింత ఫేమస్ అయిన నటి అభినయ గుడ్ న్యూస్ పంచుకుంది.
ఈ మూవీలో వెంకీ, మహేష్ బాబులకు చెల్లిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరై ఈమె.. చడీచప్పుడు కాకుండా ఎంగేజ్‌మెంట్ చేసుకుని.. ఆ గుడ్ న్యూస్‌ను అందరితో పంచుకుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అభినయ. తాజాగా సోషల్ మీడియా వేదికగా శుభవార్త పంచుకుంది. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెబుతూ.. ఇన్ స్టాలో ఎంగేజ్మెంట్ ఫోటో షేర్ చేసింది. కాబోయే భర్తతో కలిసి గుడిలో గంట కొడుతున్న ఫోటోను పంచుకుంది. అంతేకాదు నేటితో తమ ప్రయాణం ప్రారంభమైంది అంటూ తాను షేర్ చేసిన ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. కానీ తనకు కాబోయే భర్తను మాత్రం చూపించలేదు. అలాగే అతడికి సంబంధించిన వివరాలను కూడా చెప్పలేదు. ప్రస్తుతం అభినయ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. ఫ్యాన్స్, సెలబ్రెటీస్ ఆమెకు విషెస్ తెలుపుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు
ఐడియా అదిరింది.. కరెంట్ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

