ఛత్రపతి సినిమాలో నటించిన ఈ నటి.. ఆ స్టార్ హీరో చెల్లెలని మీకు తెలుసా.?
రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ది యాక్షన్ మూవీ ఛత్రపతి. డైరెక్టర్ రాజమౌళీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో యాక్షన్ హీరోగా ప్రభాస్ అదరగొట్టాడు. దీంతో ఈ మూవీతో మాస్ హీరోగా ప్రభాస్ రేంజ్ మరింత పెరిగింది. అలాగే అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన ఈ మాస్ యాక్షన్ డ్రామా ఓ రేంజ్ వసూళ్లు రాబట్టింది.

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు పూనకాలే.. ప్రభాస్ కటౌట్ బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అభిమానులు రెచ్చిపోతారు. థియేటర్స్ లో రచ్చ రచ్చ చేస్తారు ఫ్యాన్స్. రెబల్ స్టార్ సినిమా అంటే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ వరుస హిట్స్ తో మంచి జోష్ లో ఉన్నారు. ఈ ఊపు మీదే వరుసగా సినిమాలను కూడా లైనప్ చేశారు. దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు మన రెబల్ స్టార్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సలార్ సంచలన విజయం సాధించింది. అలాగే ఆ వెంటనే నాగ్ అశ్విన్‌తో కల్కి సినిమా చేశారు ప్రభాస్. కల్కి సినిమా ఏకంగా రూ. 1000కోట్ల వరకు వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన సినిమాల్లో ఛత్రపతి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఛత్రపతి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ భారీగా పెరిగిపోయారు. అలాగే ఆయన క్రేజ్ కూడా డబుల్ అయ్యింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ నటన , యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.
ఇక ఈ సినిమాలో సూరీడు పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తల్లి కొడుకు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి. సూరీడు తల్లి పాత్రలో నటించిన నటి గుర్తుందా.? అంధురాలిగా ఆమె నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పేరు అనితా చౌదరీ. తన నటనతో ఎన్నో సినిమాల్లో ఆకట్టుకున్నారు అనితా చౌదరీ. మురారి, సంతోషం, నువ్వే నువ్వే ఇలా చాలా సినిమాల్లో ఆమె నటించారు. కాగా ఆమె ఓ స్టార్ హీరోకు చెల్లి. ఆ హీరో ఎవరో కాదు సీనియర్ హీరో శ్రీకాంత్. అనిత చౌదరి భర్త, శ్రీకాంత్ కజిన్స్ అవుతారు. అలా ఆమె శ్రీకాంత్ కు చెల్లి వరస అవుతారు. ఈ విషయాన్నీ అనిత స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..