AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్ 2 షూటింగ్‌లో గాయపడ్డ హృతిక్ రోషన్..? సినిమా రిలీజ్ ఆలస్యం

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మొదటి భాగం ఇప్పటికే విడుదలై భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు వార్ 2లో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు.

వార్ 2 షూటింగ్‌లో గాయపడ్డ హృతిక్ రోషన్..? సినిమా రిలీజ్ ఆలస్యం
War 2
Rajeev Rayala
|

Updated on: Mar 11, 2025 | 10:29 AM

Share

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ వార్ 2లో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ సినిమాలో నటించనుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన వార్ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. ఇక ఇప్పుడు హృతిక్ తో కలిసి తారక్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యిందని తెలుస్తుంది. కాగా ఇటీవలే ఈ సినిమాలో అదిరిపోయే సాంగ్ షూట్ జరిగింది. కాగా ఈ సినిమా షూటింగ్ లో స్టార్ హీరో గాయపడ్డాడని తెలుస్తుంది.

వార్ 2 మూవీ షూటింగ్ లో హీరో హృతిక్ రోషన్ గాయపడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి. సాంగ్ రిహార్సిల్స్ లో హృతిక్ గాయపడ్డట్టు బాలీవుడ్ ల్లో వార్తలు వస్తున్నాయి. వార్ 2 సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో ఈ మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హృతిక్, తారక్ మధ్య ఓ అదిరిపోయే సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సాంగ్ రిహార్సిల్స్ లోనే హృతిక్ గాయపడ్డాడని తెలుస్తుంది.

ప్రస్తుతం హృతిక్ కు చికిత్స చేస్తున్నారట వైద్యులు . . దాంతో సినిమా షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తుంది.. దాంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కాగా హృతిక్ ను వైద్యులు నెల రోజులు రెస్ట్‌ తీసుకోవాలని సూచించినట్లు బాలీవుడ్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలు వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ వార్తల పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..