Ashika Ranganath: ఆ కారణంతోనే ఇన్నాళ్లు తెలుగులో సినిమాలు చేయలేదు.. హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
శాండిల్ వుడ్ బ్యూటీ తెలుగులో నటిస్తోన్న తొలి చిత్రం ‘అమిగోస్’. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ ఈ చిత్రాన్ని

టాలీవుడ్, శాండిల్‌వుడ్‌కి వర్క్ ఎన్విరాన్‌మెంట్ పరంగా పెద్దగా తేడా లేదు. భాష మాత్రమే వ్యత్యాసం. అయితే తెలుగులో మాత్రం ప్రమోషన్స్ చాలా బాగా చేస్తారు. మంచి ప్లానింగ్‌తో ముందుకు వెళతారు’’ అని అంటున్నారు హీరోయిన్ ఆషికా రంగనాథ్. ఈ శాండిల్ వుడ్ బ్యూటీ తెలుగులో నటిస్తోన్న తొలి చిత్రం ‘అమిగోస్’. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఆషికా రంగనాథ్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. అమిగోస్ సినిమా జర్నీ ఎలా మొదలైందనే విషయంతో పాటు ఆమె వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను వివరించారు.
ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ… “చిన్నప్పట్నుంచి తెలుగు సినిమాలు, పాటలు వినేదాన్ని దాని వల్ల తెలుగు అర్థమయ్యేది. ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. దాని వల్ల నేర్చుకోవటానికి అవకాశం వచ్చింది. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను సినిమాలో డైలాగులు చెప్పడం వల్ల కాస్త నేర్చుకోగలుగుతున్నాను. ” అన్నారు.




అలాగే తెలుగు ఇండస్ట్రీకి రావడానికి ఇన్నాళ్లు ఎందుకు తీసుకున్నారు మీరు ఎప్పటినుంచో నటిస్తున్నారు కదా అని అడగ్గా.. “ఈ ప్రశ్న మీరు ఇక్కడున్న దర్శకుడుని అడగాలి ఎందుకు ఆ అమ్మాయిని కూడా తీసుకురావడానికి అన్ని రోజులు పట్టింది అని నిజానికి నాకు తెలుగు ఇండస్ట్రీ నుంచి కొన్ని ఆఫర్లు వచ్చాయి అయితే ఆ సమయంలో నాకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం.. ఇలాంటి విషయాలన్నీటి వలన నేను తెలుగులో సినిమాలు చేయడం కాస్త ఆలస్యమైంది” అన్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




