Actor Vishal: హీరో విశాల్ బాడీకి 119 కుట్లు.. ఏం జరిగిందంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. కబాలి హీరోయిన్ సాయి ధన్సికతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. ఆ మధ్యన వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. కాగా ప్రస్తుతం తన సినిమా షూటింగ్ బిజీ బిజీగా ఉంటున్నాడీ యాక్షన్ హీరో.

కోలీవుడ్ స్టార్ విశాల్ ఈ మధ్యన సినిమాలు బాగా తగ్గించేశారు. ఆయన చివరిసారిగా మదగజరాజా సినిమాలో నటించారు. ఇది కూడా ఎప్పుడో పూర్తయిన సినిమా. వివిధ కారణాలతో చాలా ఆలస్యంగా రిలీజైంది. అయితే ఈ మధ్యలో పలు అనారోగ్య సమస్యలతో సతమతమయ్యాడు విశాల్. బాగా బక్కచిక్కిపోయాడు. అయితే ఇప్పుడు మళ్లీ కుదురుకున్నాడీ యాక్షన్ హీరో. మళ్లీ సినిమా షూటింగులతో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం తన 35 వ సినిమా మకుటుం షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్నాడు విశాల్. ఈ సందర్భంగా ఓ చిట్ చాట్ షోలో పాల్గొన్న అతను తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా సినిమాల్లో డూప్స్, బాడీ డబుల్స్ ఉపయోగించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘నా సినిమాలో ఎంతటి కష్టమైన స్టంట్స్ అయినా సరే నేనే స్వయంగా చేస్తాను. డూప్స్ తో చేయించడం నాకు ఏ మాత్రం ఇష్టం ఉండదని అన్నారు. అలాంటి యాక్షన్ సీక్వెన్సులు చేస్తున్న సమయంలో నేను చాలా సార్లు గాయపడ్డాను. ఇప్పటివరకు నా శరీరానికి 119 కుట్లు పడ్డాయి’ అని చెప్పుకొచ్చాడు విశాల్.
కాగా ప్రస్తుతం ‘మకుటం’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు విశాల్. పందెం కోడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అతనికి ఇది 35వ సినిమా కావడం విశేషం. దీంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మధ్యన దర్శకుడు రవి అరసుతో విభేదాలు తలెత్తాయని నెట్టింట ప్రచారం జరగుతోంది. ఇప్పుడు స్వయంగా విశాలే ఈ సినిమాని తెరకెక్కించాలన్న ఆలోచనలో ఉన్నట్టు కోలీవుడ్ వర్గాల టాక్. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.
I have 119 stitches all over my body – #Vishal#SaiDhanshika #Dhanshika #Vishal35 pic.twitter.com/74m1RHWpPa
— BuzZ Basket (@theBuzZBasket) October 18, 2025
కాగా ఇదే ఇంటర్వ్యూలో విశాల్ అవార్డుల పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తనకు జాతీయ అవార్డులతో సహా ఏ అవార్డులు ఇష్టం ఉండవన్నాడు. అవార్డు గ్రహీతల ఎంపికకు పబ్లిక్ సర్వ్ ఎందుకు తీసుకోకూడదు? నాకు అవార్డు వచ్చినా.. దానిని చెత్తబుట్టలో వేస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు విశాల్.
#Vishal: Awards Are Bull Sh*t 😯
I will throw the award into dustbin even if they give it me 🚮
Yaaruda athu Puratchi Thalapathy ah tention pannathu 🤔pic.twitter.com/FTThAv9OXL
— Kolly Corner (@kollycorner) October 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




