Allu Arjun: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్.. బెయిల్‌ పూచీకత్తు పత్రాలు సమర్పణ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శనివారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. తన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్.. బెయిల్ పూచీకత్తు పత్రాలు న్యాయమూర్తికి అందజేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజురు చేసిన సంగతి తెలిసిందే.

Allu Arjun: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్.. బెయిల్‌ పూచీకత్తు పత్రాలు సమర్పణ..
Allu Arjun
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Rajitha Chanti

Updated on: Jan 04, 2025 | 5:28 PM

సంధ్య థియేటర్ తొక్కిసలాట.. మహిళ మ‌ృతి కేసులో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ శనివారం నాంపల్లి కోర్టుకు హాజరై బెయిల్ పేపర్స్ సబ్మిట్ చేశారు. జడ్జి ముందు హాజరైన అర్జున్, బెయిల్ పూచీకత్తుకు సంబంధించిన పేపర్స్ ఇచ్చారు. పుష్ప 2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌కు బన్నీ రావడంతో.. తొక్కిసలాట జరిగింది. ఈ కేసులో థియేటర్ యాజమాన్యంతో పాటు.. అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. బన్నీ ఈ కేసులో ఏ11గా ఉన్నారు. కాగా నాంపల్లి కోర్టు శుక్రవారం అల్లు అర్జున్‌కు కండీషనల్ బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ శనివారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యి.. బెయిల్ పూచీకత్తులను సమర్పించి తిరిగి వెళ్లిపోయారు.

బెయిల్ కోసం రూ.50 వేల చొప్పున.. 2 పూచీకత్తులను ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు కండిషన్ పెట్టింది. కేసుకు సంబంధించిన సాక్షులతో మాట్లాడే ప్రయత్నం చేయవద్దని.. వారి ప్రభావితం చేయొద్దని..కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అల్లు అర్జున్‌కు న్యాయమూర్తి సూచించారు.

డిసెంబర్ 4న పుష్ప బెనిఫిట్ షో రోజు.. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి.. ఒక మహిళా అభిమాని మృతి చెందిన కేసులో.. కొద్ది రోజుల క్రితం బన్నీని పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు తొలుత ఆయనకు రిమాండ్ విధించగా.. అదే రోజు హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టును ఆశ్రయించడంతో.. వాదనలు విన్న ధర్మాసనం.. శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.