Tollywood: పెళ్లైన ఆ స్టార్ హీరోను ప్రేమించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీ నుంచి బ్యాన్..

సినీరంగుల ప్రపంచంలో తమకంటూ ఓ నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలు అడుగుపెడుతుంటారు చాలా మంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత తమ అద్భుతమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు చేసిన చిన్న చిన్న పొరపాట్లతో లైఫ్ పోగొట్టుకుంటారు. ఆఫర్స్ తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమవుతారు.

Tollywood: పెళ్లైన ఆ స్టార్ హీరోను ప్రేమించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీ నుంచి బ్యాన్..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 04, 2025 | 5:21 PM

సినీపరిశ్రమలో కథానాయికలుగా రాణించడానికి ఎంతో మంది అమ్మాయిలు ప్రయత్నిస్తుంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నటనపై ఆసక్తితో సినీప్రయాణం స్టార్ట్ చేసి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న నటీమణులు చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో వెండితెరపై ఓ వెలుగు వెలిగి సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటారు. కెరీర్ తొలినాళ్లల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి.. ఆ తర్వాత హీరోయిన్లుగా మారారు. వీరితోపాటు ఇతర భాషల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరోయిన్స్ ఎక్కువే ఉన్నారు. కానీ ఒక్కసారి హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంటే ఆ తర్వాత చేసే చిన్న పోరపాట్లతో కెరీర్ నాశనం చేసుకుంటారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. వరుస సినిమాలతో కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లైన హీరోను ప్రేమించింది. ఆ హీరోతో సహజీవనం చేసింది. ఇక ఈ విషయం ఆ హీరో భార్యకు తెలియడం.. ఆమె వార్నింగ్ ఇవ్వడం.. చివరకు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో ఆమె కెరీర్ క్లోజ్ అయ్యింది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో తెలుసా.. తనే నిఖిత.

కథానాయికగా నటించిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది నిఖిత. అప్పట్లో అందం, అభినయంతో కుర్రకారు ఫేవరెట్ కథానాయికగా మారిపోయింది. తెలుగు, తమిళ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండేది. అంతేకాదు.. అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అనే చెప్పాలి. 2002లో హాయ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వచ్చిన 2003లో కళ్యాణ రాముడు సినిమాతో హిట్ అందుకుంది. ఇందులో వేణు తొట్టంపూడి హీరోగా నటించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగులో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

తెలుగులో సంబరం, ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, మహారాజశ్రీ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక నాగార్జున, అనుష్క జంటగా నటించిన డాన్ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించింది. అయితే అప్పట్లో గ్లామర్ బ్యూటీగా ఫేమస్ అయిన నిఖిత.. కన్నడలో పలు చిత్రాల్లో నటించింది. అదే సమయంలో హీరో దర్శన్ ప్రేమలో పడింది. అప్పటికే దర్శన్ కు పెళైంది. అయినా ఇద్దరు క్లోజ్ గా ఉంటూ .. చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇక వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి దర్శన్ భార్యకు తెలియడంతో ఆమె నిఖితకు వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ ఇద్దరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో చివరకు తన భర్తపై పోలీస్ కంప్లీట్ కూడా చేసింది. చివరకు పోలీసులు దర్శన్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరి వ్యవహారం ఇండస్ట్రీలో పెద్ద రచ్చ కావడంతో నిఖితను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. దాదాపు మూడేళ్లపాటు కన్నడలో నిఖితను బ్యాన్ చేశారు. బ్యాన్ తీసేసిన తర్వాత కూడా నిఖితకు అంతగా అవకాశాలు రాలేదు. 2017లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను పెళ్లి చేసుకుంది.

Nikitha Thurkal

Nikitha Thurkal

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.