AAY Movie: వరద బాధితులకు అండగా ‘ఆయ్’ టీమ్.. నిర్మాత బన్నీవాస్ కీలక ప్రకటన

భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల ప్రజలు భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలకు నీట మునిగిన విజయవాడ నగరం ఇప్పటికీ తేరుకోలేదు. కేంద్ర బృందాలు, ఎన్టీఆర్ ఎఫ్ రంగంలోకి దిగి వరద బాధితులకు సహాయం చేస్తున్నాయి

AAY Movie: వరద బాధితులకు అండగా 'ఆయ్' టీమ్.. నిర్మాత బన్నీవాస్ కీలక ప్రకటన
Aay Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 02, 2024 | 6:13 PM

భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల ప్రజలు భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలకు నీట మునిగిన విజయవాడ నగరం ఇప్పటికీ తేరుకోలేదు. కేంద్ర బృందాలు, ఎన్టీఆర్ ఎఫ్ రంగంలోకి దిగి వరద బాధితులకు సహాయం చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాలు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు ఆయ్ మూవీ యూనిట్ ముందుకు వచ్చింది. తమ వంతు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాత, జనసేన ప్రముఖ నాయకుడు బన్నీవాస్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయ్ సినిమా ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి నేటి (సెప్టెంబ‌ర్ 2) నుంచి వీకెండ్ వ‌ర‌కు వ‌చ్చే క‌లెక్ష‌న్ల‌లో నిర్మాత షేర్‌లోని 25 శాతాన్ని జ‌న‌సేన పార్టీ త‌రుపున వరద బాధితులకు విరాళంగా అంద‌జేయ‌నున్న‌ట్లు బన్నీ వాస్ ప్ర‌క‌టించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఉండే సామాజిక బాధ్యత నుంచి స్పూర్తి పొంది బన్నీ వాస్ అండ్ టీమ్ వరద బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఆయ్ చిత్ర బృందం చాలా మంచి పని చేసిందంటూ జనసేన అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘మ్యాడ్’ మూవీతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ ఆయ్ సినిమాలో హీరోగా నటించాడు. అంజి కె మణిపుత్ర తెరకెక్కంచిన ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, గోపి, సురభి ప్రభావతి, వినోద్ కుమార్, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఆయ్ సినిమాను నిర్మించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదలైన ఆయ్ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.16.40 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిందని చిత్రబృందం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

జనసేన తరఫున విరాళంగా ఆయ్ కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.