Ponnian Selvan : జక్కన్నలా తయారైన మణిరత్నం.. ఒక్క పాట కోసం ఐశ్వర్యకు 25 రోజుల కష్టం..
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో.. ఈ సినిమాను ఫినిష్ చేసే పనిలో పడ్డారు ఈ స్టార్ డైరెక్టర్,. ఈక్రమంలోనే తాజాగా 300 మంది డ్యాన్స్‌ర్లలో
ఎప్పుడైతే రాజమౌళి (Rajamouli) లార్జర్ దెన్ లైఫ్ అంటూ బాహుబలి సినిమాను తెరకెక్కించారో.. అప్పటి నుంచి మేకర్స్ అందరూ..ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. తమ సినిమాలను కూడా.. లార్జర్ దెన్ లైఫ్‌గా ఉండేట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. సీన్ కంపోజింగ్లో విజువల్ ఎఫెక్ట్ వాడుతూ.. సీన్ కన్‌స్ట్రక్టింగ్‌లో భారీగా కాస్టింగ్‌ను తీసుకుంటూ.. సిల్వర్ స్క్రీన్ పై వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే భారీగా తెరకెక్కించడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్‌కు కొత్తేమీ కానప్పటికీ.. డిజిటల్ పార్మాట్‌లో.. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించడం మాత్రం.. జక్కన్న బాహుబలి తోనే షురూ అయింది. అయితే ఇప్పుడు ఇదే ఫార్ములాతో సినిమా తెరకెక్కిస్తున్నారు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam). తన స్టైల్ ఆఫ్ ఫిల్మ్‌తో క్రేజీయెస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈయన.. తాజాగా ‘పొన్నియన్ సెల్వన్’ (Ponniyin Selvan)అనే హిస్టారికల్ ఫిక్షన్ నావెల్‌ను తెరకెక్కిస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్లో… చాలా మంది ప్టార్ కాస్ట్ తో విజువల్ వండర్‌గా పొన్నియన్‌ను తీర్చిదిద్దుతున్నారు. సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ రిలీజ్ చేసుందుకు రెడీ కూడా అయిపోయారు. ఈ క్రమంలోనే పొన్నియన్ సెల్వన్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మణిరత్నం.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో.. ఈ సినిమాను ఫినిష్ చేసే పనిలో పడ్డారు ఈ స్టార్ డైరెక్టర్,. ఈక్రమంలోనే తాజాగా 300 మంది డ్యాన్స్‌ర్లలో ఓ సాంగ్‌ను షూట్ చేశారట మణి. అందుకోసం వీరందరికీ ఏకంగా.. 25 రోజుల పాటు ప్రాక్టీస్ చేయించారట. ఈ సాంగ్‌లో ఐశ్వర్వతో పాటు.. త్రిష కూడా ఆడిపాడనున్నారని.. వీరు కూడా.. ఈ పాట కోసం 25 రోజులు కష్టపడ్డారని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి ఈన్యూస్‌లో నిజమెంతో తెలియాలంటే.. ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే..!
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.